భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త చరిత్రను లిఖించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మయన్మార్‌తో గత శుక్రవారం జరిగిన మూడో టీ20లో 22 ఏళ్ల సోనమ్ యేషే ఈ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సోనమ్ యేషే.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసాడు. టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రస్ మాత్రమే అత్యధికంగా ఏడు వికెట్లు తీసాడు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో అతను 8 పరుగలిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

తాజాగా ఈ రికార్డ్‌ను సోనమ్ యేషే విడదీసాడు. టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో భారత పేసర్ దీపక్ చాహర్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీసాడు.
సోనమ్ యేషే ధాటికీ ఈ మ్యాచ్‌లో భూటాన్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భూటాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం మయన్మార్ జట్టు 45 పరుగులకే ఆలౌట్ అయింది.