T20 WC: టీమిండియాలో ట్రాన్స్‌జెండర్.. ట్రోలింగ్!
భారత మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. జుగుప్సాకరమైన రీతిలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అసలు ఆమె అమ్మాయేనా? అనే సందేహాలు వ్యక్తం చేశారు.
మగాడిలా ఉండేంటి? భారత మహిళా జట్టులో ట్రాన్స్‌జెండర్స్‌ను తీసుకుంటున్నారా? అని ప్రశ్నలు సంధించారు. మహిళల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ సోమవారం భారత మహిళా క్రికెటర్ల ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో భారతి ఫుల్మాలిని టార్గెట్ చేస్తూ కొంతమంది ఆకతాయిలు ట్రోలింగ్‌కు దిగారు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుందనే సోయి లేకుండా సొంత ప్లేయర్‌నే టార్గెట్ చేశారు.

పవర్ హిట్టర్..
మహారాష్ట్రకు చెందిన 31 ఏళ్ల భారతి పవర్ హిట్టర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు బౌలింగ్ సామర్థ్యం కూడా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో విదర్భ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్నారు. దేశవాళీ క్రికెట్ (సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ) లో విదర్భ తరపున వరుసగా మంచి స్కోర్లు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు.
వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో భారతి ఫుల్మాలి(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది.
తన ముఖకవలికలను ప్రస్తావిస్తూ ట్రోలింగ్ చేయడంపై భారతి ఫుల్మాలి గతంలోనే స్పందించారు. ఈ ట్రోలింగ్ తనను తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే.. అన్ని నెగటీవ్ కామెంట్స్ ఉంటాయని తెలిపారు. కానీ ఇది తనకు అలవాటైపోయిందని పేర్కొన్నారు.
పాక్‌తో షురూ..
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్-ఎలో ఉన్న భారత్.. పాకిస్థాన్‌తో జూన్ 14న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 17న నెదర్లాండ్స్, 21న దక్షిణాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 గెలిచినా.. టీ20ల్లో హర్మన్‌సేన గొప్ప ఫామ్‌లో లేదు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications