For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏం మనుషులు రా అయ్యా..అలా తిట్టేందుకు సిగ్గుండాలి: టీమిండియా మాజీ కోచ్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అండగా నిలిచాడు. అతన్ని విమర్శించేందుకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్‌నెస్ లేకున్నా.. జట్టు కోసం బరిలోకి దిగిన బుమ్రాను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రాను కొనియాడిన జనాలు ఇప్పుడు తిట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడనే విషయాన్ని మరవద్దన్ని గుర్తు చేశాడు.

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో బుమ్రా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఈ మూడింటిలో టీమిండియా రెండు ఓడింది. మరొకటి డ్రా చేసుకుంది. తాను ఆడని రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐదు టెస్ట్‌లకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 23 వికెట్లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

Bharat Arun Shreds Nonsense Criticism of Jasprit Bumrah s Workload Management

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఎందుకు..?

పూర్తి సిరీస్ ఆడలేనప్పుడు జట్టులోకి తీసుకోవడం ఎందుకని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విధానాన్ని పక్కనపెట్టాలని సునీల్ గవాస్కర్ వంటి ఆటగాళ్లు సూచించారు. తనకు నచ్చిన మ్యాచ్‌లు ఆడటం ఏంటని కూడా విమర్శించారు. బీసీసీఐ కూడా పూర్తి సిరీస్ ఆడేది ఉంటేనే బుమ్రా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అప్పుడు ప్రశంసించి..

తాజాగా బుమ్రాపై వచ్చిన విమర్శలపై తాజాగా భరత్ అరుణ్ స్పందించాడు. 'బుమ్రాపై ఇలాంటి విమర్శలు రావడం బాధకరం. అతని వెన్నుకు తీవ్రమైన శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ పూర్తవ్వడంతో అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని అంతా అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. బుమ్రా తనకు నచ్చిన మ్యాచ్‌లను ఆడుతున్నాడనే వాదన సరికాదు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించినప్పుడు అతన్ని అందరూ వరల్డ్ క్లాస్ పేసర్ అని కొనియాడారు. ఇప్పుడు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

ముందే చెప్పాడు కదా..?

ఇంగ్లండ్ పర్యటనకు ముందే అతను మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడుతానని చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి విమర్శలు వస్తాయని గ్రహించే అతను ఈ విషయాన్ని చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల్లో అతని అద్భుతంగా ఆడాడు. రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూనే జట్టును గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని ప్రయత్నాన్ని అంతా అభినందించాలి. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన బుమ్రా వంటి కీలక ఆటగాడి పని భారం, గాయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు గుప్పించడం సరికాదు.'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, August 10, 2025, 17:46 [IST]
Other articles published on Aug 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+