Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ వల్లే టెస్ట్‌ల్లోకి జస్‌ప్రీత్ బుమ్రా వచ్చాడు: మాజీ బౌలింగ్ కోచ్

 Bharat Arun Recalls Jasprit Bumrah’s Test Debut
Jasprit Bumrah - Its An Honor To Lead Team India | Test Captaincy | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగానే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడని టీమ్ మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. అతని టెస్ట్ అరంగేట్రం అనూహ్యంగా జరిగిందని భరత్ అరుణ్ గుర్తు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతోనే బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాడు.

తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన భరత్ అరుణ్.. బుమ్రా టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన తీరును వివరించాడు. జస్ప్రిత్‌ బుమ్రా ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. 2018 సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతను అనతికాలంలోనే ఫార్మాట్లకతీతంగా మేటి బౌలర్‌గా ఎదిగాడు.

 నెట్స్‌లో బౌలింగ్‌కు కోహ్లీ ఫిదా..

నెట్స్‌లో బౌలింగ్‌కు కోహ్లీ ఫిదా..

‘2018 సౌతాఫ్రికా పర్యటనకు భారత జట్టు 10-12 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఆ సమయంలో నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను సాధన చేసిన విరాట్ కోహ్లీ అతని బౌలింగ్‌కు అమితంగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బౌలర్ల అందరిలో అతనే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని చెప్పాడు. దీంతో వెంటనే బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి బుమ్రా కెరీరే మారిపోయింది.

అయితే, అంతకుముందే బుమ్రా వన్డేల్లో ఆడేటప్పుడే టెస్టు క్రికెట్‌లో రాణించాలని ఉందని నాతో చెప్పాడు.

రవిశాస్త్రి కూడా..

రవిశాస్త్రి కూడా..

అన్ని ఫార్మాట్లలో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు. నేను అదే విషయాన్ని హెడ్ కోచ్‌ రవి శాస్త్రికి చెప్పడంతో.. అప్పుడతను బుమ్రాను టెస్టుల్లో ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రాకు టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. వెంటనే కోహ్లీ కూడా సెలెక్టర్లతో మాట్లాడి అతన్ని తొలి టెస్టులో ఆడించాడు' అని భరత్‌ అరుణ్‌ గుర్తు చేసుకున్నాడు.

 ఫస్ట్ సిరీస్‌లోనే..

ఫస్ట్ సిరీస్‌లోనే..

ఇక ఊహించినట్లుగానే ఆ సిరీస్‌లో అవకాశాన్ని అందుకున్న బుమ్రాకు కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టులో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. ఆపై విదేశాల్లో టీమిండియా నంబర్‌ వన్‌ పేసర్‌గా ఎదిగాడు. ప్రతీ పర్యటనలోనూ అత్యుత్తమంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడిన బుమ్రా 113 వికెట్లను పడగొట్టాడు.

 రోహితే కరెక్ట్..

రోహితే కరెక్ట్..

టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. అతనే సరైన వాడని తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా కెప్టెన్సీ ఇవ్వచ్చని, కాకపోతే అతని బౌలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ రెండు పర్యాయాలు పనిచేశాడు. మొదట 2014 నుంచి 2015 వరకు, తరువాత 2017 నుంచి 2021 బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు.

Story first published: Friday, February 4, 2022, 13:09 [IST]
Other articles published on Feb 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+