Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bhabhi Premier League: చీరకట్టులో క్రికెట్ ఆడిన అందాల భామలు! (వీడియో)

బాబీ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) పేరిట ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సౌత్ హీరోయిన్స్ కొందరు చీరలు కట్టుకొని క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడుతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకటుకున్నారు. స్లీవ్‌లెస్ బ్లౌస్‌లో యంగ్ హీరోయిన్ అనిక సురేంద్రన్ బ్యాటింగ్ చేయగా.. మిగతా హీరోయిన్లు కీపింగ్‌తో పాటు స్లిప్‌లో ఫీల్డింగ్ చేశారు.

బ్యాటింగ్ చేస్తున్నట్లు ఫోజు ఇవ్వడంతో పాటు హెల్మెట్ పట్టుకొని చీరకట్టులో అనికా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కుర్రాళ్ల మదిని దోచేసింది. అంతేకాకుండా క్రికెట్ ఆడుతూ వారిచ్చిన స్మైల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా రోజుల క్రితమే ఓ యాడ్ కోసం ఈ షూట్ తీసినట్లు తెలుస్తోంది. కానీ కొందరు 'బాబీ ప్రీమియర్ లీగ్' పేరిట ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.

Bhabhi Premier League: Anikha Surendran Plays Cricket In Saree Goes Viral

బాల నటిగా గుర్తింపు పొందిన అనికా సురేంద్రన్ తెలుగు, తమిళంతో పాటు మళయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సూపర్ హిట్ మూవీ విశ్వాసంలో అతని కూతురిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. తెలుగులో అనికా విశ్వాసం, బుట్టు బొమ్మ, ఓ మై డార్లింగ్, దీ ఘోస్ట్, కింగ్ ఆఫ్ కోటా సినిమాల్లో నటించింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ లీగ్ ఎప్పుడు? ఎక్కడ మొదలవుతుంది? అని కొందరు అడుగుతుంటే.. ఇంకొందరు ఈ లీగ్ కోసం ఎక్కడికైనా వస్తా.. జాబ్ కూడా వదిలేస్తామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ లీగ్ ఎక్కడ? ఏ చానెల్‌లో చూడాలని మరికొందరు అడుగుతున్నారు. ఇలాంటి బాబీలు బ్యాటింగ్ చేస్తే క్యాచ్‌లన్నీ వదిలేస్తానని మరో యూజర్ స్పందించాడు. బాబీ లవర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే పడిచస్తారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా చీరకట్టులో బీసీసీఐ ఓ లీగ్‌ను ప్లాన్ చేయవచ్చు కదా..? అని మరికొందరు సలహా ఇస్తున్నారు.

Story first published: Thursday, February 1, 2024, 17:50 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+