For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ భయ్యా.. వదినమ్మ నీతో కలిసి ఓపెనింగ్‌ చేయబోతున్నారా?!!

Bhabhi open karne wali hai kya?: Yuzvendra Chahal asks Rohit Sharma as he posts workout video with Ritika

దుబాయ్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ ప్రారంభం కావడానికి నెల కన్నా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్‌లో ఉన్నాయి. గత శుక్రవారం రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది. ఆటగాళ్ళ అందరికి ఓ లగ్జరీ హోటళ్ళో బస ఏర్పాటు చేసింది ముంబై యాజమాన్యం.

వర్కౌట్ వీడియో:

వర్కౌట్ వీడియో:

దుబాయ్ రూల్స్ ప్రకారం ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అందరూ క్వారంటైన్‌‌లో ఉన్నారు. ముంబై ఆటగాళ్లు హోటల్ రూంలోనే ఉంటూ.. ఫిట్‌నెస్‌ కోచ్ చెప్పిన విధంగా రోజు వర్కౌట్స్ చేస్తున్నారు. ముంబై సారథి రోహిత్‌ శర్మ తాజాగా తన భార్య రితికతో కలిసి వర్కౌట్స్‌ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వీడియోలో రోహిత్ చేసిన మాదిరిగానే రితిక కూడా వర్కౌట్స్‌ చేశారు. వీడియోను షేర్‌ చేసిన రోహిత్.. 'ఇద్దరం కలిసి స్ట్రాంగ్ అవుదాం' అని కాప్షన్ పెట్టాడు. ఒక బ్లూకలర్‌ ఎమోజీని జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

 ఓపెనింగ్‌ చేయబోతున్నారా?:

ఓపెనింగ్‌ చేయబోతున్నారా?:

రోహిత్ శర్మ షేర్ చేసిన వీడియోపై టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ ఫన్నీగా స్పందించాడు. 'రోహిత్ భయ్యా.. వదినమ్మ నీతో కలిసి ఐపీఎల్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నారా?' అని కామెంట్‌ చేశాడు. అయితే రోహిత్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సోషల్ మీడియా వేదికగా చహల్ చేసే హడావుడి మాములుగా ఉండదు. లాక్‌డౌన్ సమయంలో ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేసిన ఈ లెగ్ స్పిన్నర్.. తాజాగా ఫన్నీ కామెంట్‌‌తో ఓపెనర్ రోహిత్ శర్మను ఆటపట్టించాడు. మరోవైపు ఆ వీడియోపై రోహిత్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. 'కపుల్‌ గోల్స్‌ యట్‌ పీక్స్'‌ అంటూ కొందరు కామెంట్‌ చేశారు.

ఇంట్లో పనులు లేనట్టున్నాయి:

ఇంట్లో పనులు లేనట్టున్నాయి:

ఇదివరకు కూడా రోహిత్ శర్మను యజువేంద్ర చహల్‌ ఆటపట్టించాడు. స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ 'లా లిగా'లో రియల్‌ మ్యాడ్రిడ్ విజయం సాధించడంతో.. 'రియల్‌ మ్యాడ్రిడ్‌ ఖాతాలో ఇంకో విజయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ జట్టు కలిసికట్టుగా ఆడి విజయం సాధించింది. అందరికీ అభినందనలు. మొత్తానికి ఈ ఏడాదిలో ఓ శుభవార్త విన్నాం' అని ఆనందంగా నవ్వుతూ చేయి పైకెత్తిన ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన చహల్.. 'ఈ చిరునవ్వు వెనుక నిజమైన కారణం వేరే ఉంది. ఈ రోజు ఇంట్లో ఊడవడం, తూడవడం లాంటి పనులు లేనట్టున్నాయి' అని చహల్ పంచ్ ఇచ్చాడు.

స్థానిక మైదానంలో ప్రాక్టీస్‌:

ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్‌ శర్మకు పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. తర్వాత తిరిగి కోలుకోవడంతో ఐపీఎల్‌లో చెలరేగుతాడని అంతా ఆశించారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఆ మెగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రోహిత్‌ ఇటీవలే లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చి స్థానిక మైదానంలో ప్రాక్టీస్‌ చేశాడు. ఇప్పడు ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్నాడు.

మన్కడింగ్‌పై పాంటింగ్‌తో సంభాషణ ఆసక్తికరంగా సాగింది.. ఏం మాట్లాడానంటే..?: అశ్విన్‌

Story first published: Tuesday, August 25, 2020, 19:44 [IST]
Other articles published on Aug 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+