BGT: సీల్ తీయని ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. ఈ బాధ వర్ణాతీతం అంటూ ట్వీట్! జొమాటో ఫన్నీ కామెంట్!

నాగ్‌పూర్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కొత్త మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం నాగ్‌పూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. అయితే మంగళవారం విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా అయ్యింది. 'కొత్త ఫోన్‌ను కనీసం అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్‌ను చూశారా? 'అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫోన్ పోయిందనే ఈ ట్వీట్ క్షణాల్లో వైరలవ్వగా.. అతని అభిమానులు అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం తమ హాస్యపూరితమైన ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నారు.
వదిన ఫోన్ నుంచి ఐసీక్రీమ్ ఆర్డర్ చేయ్..
ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విరాట్ కోహ్లీకి అదిరిపోయే బదులిచ్చింది. 'బాబీ ఫోన్ నుంచి ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఏమాత్రం సందేహించొద్దు. అది కచ్చితంగా నీకు సాయపడుతుంది'అని రిప్లే ఇచ్చింది. ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్రీగా తమ బిజినెస్‌ను అడ్వైజ్ చేసుకుంటుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం జొమాటోలో ఆర్డర్ చేయడం కంటే ఐస్‌క్రీమ్ తినకుండా ఉండటం మేలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కోహ్లీ మొబైల్ ఫోన్ పోవడం ఏమో కానీ జొమాటో వార్తల్లో నిలిచింది.
మొబైల్ కంపెనీ ప్రమోషన్..
విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆ ఫోన్‌ను కొనుగోలు చేయగా.. ఆ మొబైల్‌ను కనీసం ఓపెన్ చేయకుండానే వాళ్లు తీసుకెళ్లిపోయినట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏ మొబైల్ కోసం ఈ పెయిడ్ ట్వీట్ అని విరాట్ ప్రశ్నిస్తున్నారు. వివో ఫోన్ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ ట్వీట్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. అయితే విరాట్ తన ట్వీట్‌లో ఎలాంటి బ్రాండ్స్ మెన్షన్ చేయలేదని, నిజంగానే అతని మొబైల్ పోయినట్లుందని మరికొందరు అంటున్నారు.
శోభనం రోజు చచ్చినట్లుగా..
ఓ యూజర్ అయితే సీల్ తీయని ఫోన్ పోవడానికి మించిన బాధ మరొకటి ఉండదని ఓ క్రైమ్ న్యూస్‌కు సంబంధించిన లింక్ షేర్ చేశాడు. ఆ వార్తలో శోభనం రోజు పెళ్లికొడుకు గుండెపోటుతో మరణించినట్లు ఉంది. సీల్ తీయని మొబైల్ పోవడం కూడా ఇలాంటిదేనని సదరు అభిమాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ట్వీట్ తమను ఆకట్టుకుందని, తాము 75వ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నామని మరో అభిమాని కామెంట్ చేశాడు.
స్పిన్‌ను ఎదుర్కొనేందుకు..
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతటి బౌలర్‌నైనా ఎదుర్కొనే సత్తా ఉన్న కోహ్లీ.. స్పిన్‌కు మాత్రం కాస్త తడబడుతాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఆడటంలో విరాట్ విఫలమవుతున్నాడు. ఇటీవల కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ బలహీనతపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కోహ్లీ.. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లు ఆడటం నేర్చుకుంటున్నాడు. సోమవారం జరిగిన సెషన్స్‌లో విరాట్ పూర్తిగా లెఫ్టార్మ్ స్పిన్నర్లనే ఎదుర్కొన్నాడు. నెట్ బౌలర్ సౌరభ్ కుమార్ బౌలింగ్‌ను ఎక్కువ సేపు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications