Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BGT: రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్.. సూర్యకుమార్ ఇన్.. పుజారా ఔట్!

BGT: India’s Master Plan vs Australia; Surya likely to replace Pujara for counter attack the spinners

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ సిరీస్ కోసం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాయి. విజయం కోసం వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా కీలకం. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో టీమిండియా కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయమే లక్ష్యంగా సన్నదమవుతోంది.

స్పిన్‌ బౌలింగే కీలకం..

స్పిన్‌ బౌలింగే కీలకం..

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం టీమ్‌కు అడ్వాంటేజ్ ఉండేలా టర్నింగ్ ట్రాక్స్ సిద్దం చేస్తోంది. భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్‌లను రూపొందిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆస్ట్రేలియా సైతం స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డానియల్ వెటోరిని తమ కోచ్‌గా నియమించుకుంది. ప్రాక్టీస్ శిభిరంలో భారత దేశవాళీ స్పిన్నర్లతో ముమ్మర సాధన చేస్తోంది. జట్టులోకి ఎక్స్‌ట్రా స్పిన్నర్లను తీసుకుంది. మరోవైపు భారత్ సైతం స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది.

ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..

ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..

స్పిన్నర్లనే కాదు ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడాలని బ్యాటర్లకు నూరిపోస్తున్నాడు. గత ఆసీస్ పర్యటనలో రిషభ్ పంత్ దూకుడు మంత్రంతోనే సక్సెస్ అయ్యాడని, జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడని భారత బ్యాటర్లకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్స్‌లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల చేత ద్రవిడ్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేయించాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. స్పిన్నర్లతో పాటు పేసర్ల బౌలింగ్‌లోనూ ఎదురు దాడికి దిగాలని, ఆచితూచి ఆడితే జట్టుకు నష్టం కలుగుతోందని ద్రవిడ్ ఆటగాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.

రిషభ్ పంత్ తరహా బ్యాటింగ్..

రిషభ్ పంత్ తరహా బ్యాటింగ్..

స్వీప్ షాట్లతో ఆస్ట్రేలియా స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లకు ద్రవిడ్ సూచించాడు. రిషభ్ పంత్ తరహాలో బ్యాటింగ్ చేయాలని ఆదేశించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో భారత బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ మిస్సవ్వనుందని, శ్రేయస్ అయ్యర్ కూడా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

పుజారా ఔట్..

పుజారా ఔట్..

స్పిన్‌ను తనదైన స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో సమర్ధవంతంగా ఆడగలిగే సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకుంటే ఆసీస్ బౌలర్లను ఇబ్బంది పెడతాడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చతేశ్వర్ పుజారాను పక్కనపెట్టి సూర్యను ఆడించాలనే వ్యూహం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగతా టెస్ట్‌ల్లో కొనసాగించాలని, విఫలమైతే మళ్లీ పుజారాను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారాకు తిరుగులేదు. ఈ తరం క్రికెటర్లలో బీజీటీలో అతనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

Story first published: Tuesday, February 7, 2023, 16:00 [IST]
Other articles published on Feb 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+