IND vs SL పింక్ బాల్ పిచ్‌పై ఐసీసీ చర్యలు.. పాక్X ఆసీస్ పిచ్‌పై నిషేధం విధించాలంటున్న ఫ్యాన్స్!

దుబాయ్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇటీవల ముగిసిన పింక్ బాల్ మ్యాచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ అత్యంత సాధారణంగా ఉందని ఐసీసీ పేర్కొంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఐసీసీ పిచ్, ఔట్‌ఫీల్డ్ పర్యవేక్షణ ప్రక్రియలో భాగంగా బెంగళూరు పిచ్ మరీ నాసిరకంగా ఉందని ఒక డీమెరిట్ పాయింటు కేటాయించింది. ఐదేళ్ల వరకు ఈ డీమెరిట్ పాయింట్లు పరిగణనలో ఉంటాయి. ఈ పాయింట్లు 5 అందుకున్న వేదికపై 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధం పడుతుంది.

బౌలర్లకు అనుకూలంగా..
మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇచ్చిన రిపోర్ట్‌లో పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు. 'మొదటి రోజు నుంచే పిచ్‌పై బంతి ఎక్కువ టర్న్ అయింది. ప్రతి సెషన్ తర్వాత ఇది మరింత ఎక్కువైంది. నా దృష్టిలో ఇది బ్యాటు, బంతి మధ్య సరైన పోటీ కాదు'అని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ పేర్కొన్నాడు.
శ్రీనాథ్ నివేదికను ఐసీసీ.. బీసీసీఐకి పంపింది. 'మ్యాచ్ రిఫరీ అత్యంత సాధారణమని ప్రకటించిన వేదికకు ఒక అయోగ్యత పాయింటు ఇస్తారు. పేలవం, పనికిరాని పిచ్‌లకు వరుసగా 3, 5 పాయింట్లు కేటాయిస్తారు'అని ఐసీసీ స్పష్టం చేసింది.

సొంతమైదానంపైనే..
కాగా, రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి.
అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కరుణరత్నే సూపర్ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్‌పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగాడు.

రావల్పిండి పిచ్‌పై నిషేదమే..
ఐసీసీ చర్యలను భారత అభిమానులు తప్పుబడుతున్నారు. బెంగళూరు పిచ్ నాసిరకమైతే.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరిగిన రావల్పిండి, కరాచీ టెస్ట్‌ల పిచ్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించిన ఆ పిచ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు పిచ్‌లతో పొలిస్తే బెంగళూరు వికెట్ చాలా నయమని కామెంట్ చేస్తున్నారు. ఇక రావల్పిండి వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఆసీస్, పాక్ భారీ స్కోర్లు చేయగా.. మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లోనూ భారీ స్కోర్లు నమోదై మ్యాచ్ ఫలితం తేలలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications