For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిత్తుగా ఓడిన పాకిస్థాన్

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో కొలంబో వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చెత్త బ్యాటింగ్‌తో 107 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పాకిస్థాన్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసినా.. బ్యాటర్లు రాణించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేసింది. బెత్ మూనీ(114 బంతుల్లో 11 ఫోర్లతో 109) విరోచిత సెంచరీతో చెలరేగగా.. అలానా కింగ్(49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆమెకు అండగా నిలిచింది. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కు 106 పరుగులు జోడించి ఆసీస్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆసీస్ 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ కాసేపటికే కిమ్ గార్త్ కూడా ఔటవ్వడంతో ఆసీస్ ఆలౌట్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ బెత్ మూనీ, అలానా కింగ్ అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆసీస్‌ను నిలబెట్టారు.

Beth Mooney s Fighting Century Leads Australia to Victory Over Pakistan in Women s World Cup 2025

పాకిస్థాన్ బౌలర్లలో నష్రా సంధు(3/37) మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్(2/29), ఫాతిమా సనా(2/49) రెండేసి వికెట్లు పడగొట్టారు. డయాన బైగ్, సదియా ఇక్బాల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం పాకిస్థాన్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. సిద్రా అమిన్(35) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్(3/14) మూడు వికెట్లతో చెలరేగగా.. మేఘన స్కట్(2/25), అన్నబెల్ సదర్లాండ్(2/15) రెండేసి వికెట్లు పడగొట్టారు. అలానా కింగ్, అష్లే గార్డ్‌నర్, జార్జియో వేర్‌హమ్ తలో వికెట్ తీసారు. విరోచిత సెంచరీ బాదిన బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు మూడు మ్యాచ్‌లకు మూడు ఓడిన పాకిస్థాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది.

Story first published: Thursday, October 9, 2025, 6:34 [IST]
Other articles published on Oct 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+