Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే!!

Best spell of fast bowling from an Indian in long time says Bharat Arun over Jasprit Bumrah bowling

జమైకా: ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్‌ ( 5/7) వేసాడు. 8 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీనిపై టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్ స్పందించారు. చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే అని పేర్కొన్నారు. భరత్ అరుణ్‌ ఇటీవలే తిరిగి బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

అత్యుత్తుమ స్పెల్‌ అది:

అత్యుత్తుమ స్పెల్‌ అది:

బుధవారం భరత్‌ అరుణ్ మాట్లాడుతూ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ అది. మనకు కావాల్సింది వికెట్లే. బుమ్రా ఆలోచించే బౌలర్‌. బ్యాట్స్‌మన్‌, పరిస్థితులకు అనుగుణంగా లెంగ్త్‌లు మార్చుకుంటాడు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చూస్తే ఇదే అర్ధమవుతుంది. ఒకసారి వేసిన బంతి వెంటనే వేయడు' అని అరుణ్ తెలిపారు.

బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉంటుంది:

బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉంటుంది:

'తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా షార్ట్‌ బంతులు వేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతను లెంగ్త్‌ను సవరించుకున్నాడు. బుమ్రా నిలకడగా 140 గంటకు కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. అవసరమైనపుడు స్లో బంతులు కూడా వేస్తాడు. అది బ్యాట్స్‌మన్‌ను బట్టి ఉంటుంది. అతడి బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కాదు. బంతులను అర్ధం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది' అని అరుణ్ పేర్కొన్నారు.

బుమ్రా బౌలింగ్‌పై చర్చించం:

బుమ్రా బౌలింగ్‌పై చర్చించం:

'బుమ్రా బౌలింగ్‌పై చర్చించం. కేవలం లెంగ్త్‌లు సవరించుకోవాలని సూచించాం. ఆవిధంగా సాధన చేసి ఫలితాలు రాబట్టుతున్నాడు. బౌలర్ల పనిభారంపై పూర్తి శ్రద్ధపెట్టాం. వారిని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడం చాలా అవసరం. ఫిట్‌నెస్‌ విషయంలో ఎంత కష్టపడుతున్నారనేదీ మేము చర్చిస్తున్నాం. ఇషాంత్‌, బుమ్రానే కాదు బంతి ఇచ్చిన ప్రతిసారీ షమీ కూడా రాణిస్తున్నాడు' అని అరుణ్ చెప్పుకొచ్చారు. 'ప్రతి బౌలర్ భిన్నంగా ఉంటాడు. ప్రతి బౌలర్‌తో నా పరస్పర చర్య కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది. బౌలర్ల మనస్తత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం' అని ఆయన అన్నారు.

మురళీధరన్‌ అరుదైన టెస్టు రికార్డును అశ్విన్‌ను బద్దలు కొట్టేనా!!

సిరీస్‌పై భారత్ కన్ను:

సిరీస్‌పై భారత్ కన్ను:

రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వాలో జరిగిన మొదటి టెస్టును 319 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు ఆతిధ్య విండీస్ ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

Story first published: Thursday, August 29, 2019, 16:16 [IST]
Other articles published on Aug 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+