For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రయ్యిన పరుగెత్తడానికి మేం కార్లం కాదు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై బెన్ స్టోక్స్ ఫైర్!

Ben Stokes urges ECB and all cricket chiefs to stop treating players like cars

లండన్‌: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రయ్యిన పరుగెత్తడానికి తాము కార్లం కాదని, సాధారణ మనుషులమని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తీరిక లేని షెడ్యూల్ కారణంగానే వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పానని తెలిపిన స్టోక్స్.. తన రిటైర్మెంట్‌ ఇబ్బడిముబ్బడిగా సిరీస్‌లు, మ్యాచ్‌లు ఆడించేస్తున్న క్రికెట్‌ బోర్డులకు ఒక హెచ్చరిక అని చెప్పాడు. మంగళవారం సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన బెన్‌ స్టోక్స్.. ఈ మ్యాచ్‌కు ముందు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పెట్రోల్ పోసి ఆడించేందుకు..

పెట్రోల్ పోసి ఆడించేందుకు..

'మేం కార్లం కాదు. పెట్రోల్ నింపేసి ఆడించేస్తే.. ఆట అయిపోయాక మళ్లీ నింపుకోవడానికి. మేం ఓ పక్క టెస్టు సిరీస్‌ ఆడుతుంటే.. అదే సమయంలో మరో ఇంగ్లిష్‌ జట్టు వన్డే సిరీస్‌ ఆడడం విడ్డూరం. మూడు ఫార్మాట్ల కారణంగా క్రికెట్‌ అపరిమితం అయిపోయింది. ఒకప్పటితో పోలిస్తే శ్రమ ఎక్కువైంది. బాగా అలసిపోతున్నాం. ఎంత ఎక్కువ క్రికెట్‌ ఆడితే అంత మంచిదని ఒప్పుకుంటా. కానీ అది అత్యున్నత ప్రమాణాలతో సాగాలి. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని జట్లూ కొన్ని సిరీస్‌ల నుంచి ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నాయి. నా వరకు నేను ఎక్కువ కాలం ఆటలో కొనసాగాలని అనుకుంటున్నా. టెస్టు కెప్టెన్‌గా ఉండడానికి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా'అని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

అంతకముందు వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను స్టోక్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 'మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను. కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. అందుకే 11 ఏళ్ల వన్డే కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నా'అని సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

కోహ్లీ గొప్ప ఆటగాడు..

కోహ్లీ గొప్ప ఆటగాడు..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టోక్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానంలో విరాట్‌ కోహ్లీ ఉత్తేజం, అంకితభావం తనకెంతో నచ్చుతాయన్నాడు. స్టోక్స్ రిటైర్మెంట్‌పై స్పందించిన కోహ్లీ.. అతను చాలా పోటీతత్వమున్న ఆటగాడని కొనియాడాడు. దీనిపై స్టోక్స్‌ స్పందిస్తూ.. 'కోహ్లీ అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు. అతడితో తలపడడాన్ని ఆస్వాదించా. ఆటకు అతడిచ్చే ఊపు, ఆటపట్ల అతడికున్న అంకితభావం నచ్చుతాయి. కోహ్లీతో పోటీపడడం మొదలు పెట్టకముందు నుంచే అతడంటే ఇష్టం. కోహ్లీ నా గురించి చెప్పింది విని సంతోషించా'' అని పేర్కొన్నాడు.

చివరి మ్యాచ్‌లో దక్కని విజయం..

చివరి మ్యాచ్‌లో దక్కని విజయం..

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దాంతో కెరీర్‌లో చివరి వన్డే ఆడిన స్టోక్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగులు చేసింది.

వాండర్‌డసెన్‌ ( 117 బంతుల్లో 10 ఫోర్లతో 134) సెంచరీకి.. మార్‌క్రమ్‌ (61 బంతుల్లో 9 ఫోర్లతో 77), జానెమన్‌ మలన్‌ (77 బంతుల్లో 5 ఫోర్లతో 57) అర్ధశతకాలు తోడవడంతో సఫారీ జట్టు భారీ స్కోర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 46.5 ఓవర్లలో 271 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బెయిర్ స్టో(71 బంతుల్లో 7 ఫోర్లతో 63), జోరూట్(77 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86) రాణించిన ఫలితం లేకపోయింది.

Story first published: Wednesday, July 20, 2022, 10:10 [IST]
Other articles published on Jul 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+