Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెన్ స్టోక్స్‌ మూతి పగిలిపోయిందే.. అసలు ఏమైందంటే?

Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోను షేర్ చేశాడు. అందులో బెన్ స్టోక్స్ కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు స్టోక్స్ 'బంతి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి'అని నవ్వుతూ ఉన్న ఎమోజీతో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ మీడియా కథనాల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టోక్స్‌కు ఈ గాయం కాలేదని తెలుస్తోంది. తన సహచర ఆటగాళ్లతో పక్కన నిలబడి ఉన్న సమయంలో ఆకస్మాత్తు వచ్చిన బంతిని స్టోక్స్ గమనించలేదని, అది నేరుగా అతని ముఖం కుడి వైపున బలంగా తాకినట్లు సమాచారం. స్టోక్స్ ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో అయిన గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టోక్స్.. కేవలం టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ గాయం నుంచి స్టోక్స్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Ben Stokes Suffers Severe Facial Injury After Being Struck by Ball England Star Hospitalised

స్టోక్స్ కెప్టెన్సీపై విమర్శలు..

యాషెస్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం (4-1) తర్వాత బెన్ స్టోక్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జట్టు ప్రదర్శన ఇంత దారుణంగా ఉన్నా, తన ఆటగాళ్లను స్టోక్స్ వెనుకేసుకురావడంపై దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'జోష్ టంగ్, బ్రైడన్ కార్సేలు నిలకడగా బౌలింగ్ చేశారని స్టోక్స్ మెచ్చుకోవడం చూస్తుంటే నాకు రాయ్ కీన్ (ఫుట్‌బాల్ దిగ్గజం) గుర్తొచ్చాడు. రోజంతా జట్టు కోసం కష్టపడటం అనేది ఒక ఆటగాడి బాధ్యత. అలా చేయలేనప్పుడు మీరు తప్పు క్రీడను ఎంచుకున్నట్లే' అని ఘాటుగా విమర్శించారు.

యాషెస్ ఐదో టెస్ట్ తర్వాత స్టోక్స్ తన జట్టుకు అండగా మాట్లాడాడు. 'మా ప్రయత్నాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. కేవలం వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవ్వడం వల్లే ఓడిపోయాం. ఈ పర్యటనలో మేము చాలా క్యాచ్‌లు వదిలేశాం. అది మాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. కానీ జట్టు నిబద్ధతను, శక్తిని నేను తప్పుబట్టలేను. మేము బాగా ఆడలేదని మాకు తెలుసు, ఆ బాధ్యతను మేము స్వీకరిస్తాం. అయితే ఆటగాళ్ల చిత్తశుద్ధిని ఎవరూ శంకించకూడదు.'అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 5, 2026, 20:09 [IST]
Other articles published on Feb 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+