Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను మా ఆశలను చిదిమేశాడు: బెన్ స్టోక్స్

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే యాషెస్ సిరీస్‌లో శుభారంభం అందుకోలేకపోయామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఈ మ్యాచ్‌‌ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని భావించామని, కానీ ట్రావిస్ హెడ్ తనదైన బ్యాటింగ్‌తో తమ విజయవకాశాలను లాగేసుకున్నాడని చెప్పాడు.

పెర్త్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్(83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో హోరాహోరీ తప్పదని భావించిన మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించాడు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బెన్ స్టోక్స్.. ట్రావిస్ హెడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఈ పరాజయంతో షాక్‌కు గురయ్యాను. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. దూకుడుగా ఆడాడు. ఇది ఓ గొప్ప ఇన్నింగ్స్. ఆసీస్ ఆటగాళ్లు చాలా ధైర్యంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. క్రీజులో సెట్ అయితే భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. ట్రావిస్ హెడ్ తన విధ్వంసంతో మా ఆశలను చిదిమేశాడు. ఈ పిచ్‌పై రిస్క్ తీసుకొని ఆడినవారికే ఆశించిన ఫలితం దక్కింది. ముఖ్యంగా బౌలర్లపై ఒత్తిడి తెచ్చినవారే పరుగులు చేయగలిగారు.

Ben Stokes Shell-Shocked by Travis Head s 69-Ball Century After Australia Defeat England in the 1st Ashes Test

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు మేం మూడు, నాలుగు ప్రణాళికలను ప్రయత్నించాం. కానీ అతను ఓ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోయాడు. అతన్ని ఆపడం చాలా కష్టమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా తొలి ఇన్నింగ్స్‌లో మేం బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. తొలి రోజు ఆటలో చాలా జరిగింది. బౌలర్లకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్ పూర్తిగా మా నియంత్రణలోనే ఉందని భావించాను. కానీ అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా. మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌కు చాలా సమయం ఉంది. ఆ మ్యాచ్ గెలిచేందుకు శ్రమిస్తాం.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

205 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్.. ట్రావిస్ హెడ్(83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123) విధ్వంసకర శతకంతో 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేయగా.. ఆసీస్ 132 పరుగులకు ఆలౌటైంది.

40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యం నమోదైంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్‌కు కష్టమవుతుందని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి టీ20 బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించాడు.

Story first published: Saturday, November 22, 2025, 17:14 [IST]
Other articles published on Nov 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+