ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: బెన్ స్టోక్స్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో కీలక సమయంలో తాను, జోరూట్ ఔటవ్వడమే విజయవకాశాలను దెబ్బతీసిందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్‌పై పట్టు సాధించిన ఇంగ్లండ్.. ఫాలో ఆన్ ఆడించి మూల్యం చెల్లించుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ నుంచి అనూహ్య ప్రతి ఘటన ఎదురవ్వడం.. రెండో ఇన్నింగ్స్‌లో తమ బ్యాటర్లు విఫలమవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజార్చుకుంది. దాంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ ఓటమిపై స్పందించిన బెన్ స్టోక్స్.. ఓడినా అసలు సిసలు టెస్ట్ మ్యాచ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.

సూపర్ గేమ్..
'టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో ఈ మ్యాచ్ చూపించింది. అసలు సిసలు టెస్ట్ మ్యాచ్ మజాను అభిమానులకు అందించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు తారా స్థాయికి చేరాయి. ఇదో అద్భుతమైన మ్యాచ్. న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ తరహా గొప్ప మ్యాచ్‌లో భాగమవ్వడం సంతోషంగా ఉంది.
ఈ మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరికి తమ డబ్బుకు తగిన ప్రతిఫలం దక్కింది. నేను, జోరూట్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యాన్ని విడదీయడం కివీస్‌కు కలిసొచ్చింది. మా పార్ట్‌నర్‌షిప్‌ను విడదీయడానికి టామ్ లాథమ్ పై ఎత్తులు వేస్తాడని మేం ముందే గ్రహించాం. కానీ అతని వ్యూహాన్ని తిప్పికొట్టలేకపోయాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమే'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

జోరూట్ ఆదుకున్నా..
258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 256 పరుగులకే కుప్పకూలి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దాంతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. 48/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆట ఆసాంతం ఉత్కంఠగా సాగింది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్.. జోరూట్(113 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95), బెన్ స్టోక్స్(116 బంతుల్లో 6 ఫోర్లతో 33) రాణించడంతో ఓ దశలో 201/5తో పటిష్టంగా కనిపించింది.
కానీ వాగ్నర్ వరుస ఓవర్లలో ఈ ఇద్దర్నీ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెన్ ఫోక్స్(35) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో అండర్సన్‌ను వాగ్నర్ ఔట్ చేసి కివీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

బెడిసికొట్టిన బజ్‌బాల్ కాన్సెప్ట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హరీ బ్రూక్(176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 186), జోరూట్(224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153 నాటౌట్) సెంచరీలతో రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/100) నాలుగు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(2/54) రెండు వికెట్లు పడగొట్టాడు. టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 209 పరుగులకు కుప్పకూలింది.

కేన్ మామ సెంచరీ..
226 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్‌ను కేన్ విలియమ్సన్(282 బంతుల్లో 12 ఫోర్లతో 132) సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేన్ విలియమ్సన్‌కు తోడుగా టామ్ బ్లండెల్(166 బంతుల్లో 9 ఫోర్లతో 90), డారిల్ మిచెల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
దాంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 256 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ మూడు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. ఫాలో ఆన్ ఆడించడంతో పాటు బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఆడటం ఇంగ్లండ్ కొంపముంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications