For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: బెన్ స్టోక్స్ బలుపు మాటలు..!(వీడియో)

భారత్‌తో నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సహనం కోల్పోయాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ నోటికి పనిచెప్పాడు. భారత బ్యాటర్లు డ్రాకు అంగీకరించకపోవడంతో వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

174/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. తొలి సెషన్‌లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఔటయ్యారు. దాంతో టీమిండియా ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పించారు. అజేయ శతకాలతో చెలరేగి ఐదో వికెట్‌కు అజేయంగా 203 పరుగులు జోడించారు. దాంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Ben Stokes Sarcastic Jab to Jadeja Want a Test Hundred Against Harry Brook Sparks Controversy Amidst Manchester Draw

అయితే జడేజా, వాషింగ్టన్ సుందర్ అసాధారణ బ్యాటింగ్‌తో విసిగిపోయిన బెన్ స్టోక్స్‌ నిర్ణీత సమయం కంటే ముందే డ్రా చేసుకుందామని భారత బ్యాటర్లను కోరాడు. కానీ జడేజా, సుందర్ సెంచరీలకు చేరవవ్వడంతో అందుకు భారత్ అంగీకరించలేదు. దాంతో సహనం కోల్పోయిన బెన్ స్టోక్స్.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేయాలనుకుంటున్నావా? అని జడేజాను కించపర్చేలా మాట్లాడాడు. అందుకు జడేజా.. డ్రా నిర్ణయం తన చేతుల్లో లేదని, కెప్టెన్ ఆదేశాలు పాటించడమే తన పనని చెప్పాడు.

బలుపు మాటలతో..

హ్యారి బ్రూక్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా.. అతని మరుసటి ఓవర్‌లో సుందర్ బౌండరీ, క్విక్ డబుల్ సాయంతో టెస్ట్‌ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే భారత్ డ్రాకు అంగీకరించడంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు స్టోక్స్ నిరాకరించాడు. కోపంగా వెళ్లిపోయాడు. బెన్ స్టోక్స్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టోక్స్ బలుపు మాటలు భారత ఆటగాళ్లను కించపర్చేలా ఉన్నాయని మండిపడుతున్నారు.

Story first published: Monday, July 28, 2025, 0:27 [IST]
Other articles published on Jul 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+