భారత్‌తో చివరి టెస్ట్‌కు ఓలీ రాబిన్సన్, షోయబ్ బషీర్‌లను దూరంగా ఉంచామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు స్టమక్ అప్‌సెట్‌తో బాధపడుతున్నారని, మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజే ఈ ఇబ్బంది తలెత్తడంతో రిస్క్ ఎందుకని పక్కనపెట్టామని చెప్పాడు.
భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయిన ఇంగ్లండ్.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి పోరుకు సిద్దమైంది. కనీసం ఈ మ్యాచ్‌లోనై విజయం సాధించి గౌరవంగా భారత పర్యటనను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న బెన్‌స్టోక్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధర్మశాల పిచ్ సమతూకంగా కనిపిస్తుండటంతో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

'ధర్మశాలకు రాకముందే ఇక్కడ ముగ్గురు పేసర్లతో ఆడాల్సి ఉంటుందని భావించాం. కానీ పిచ్ చూసిన తర్వాత ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగడం ఉత్తమమనిపిస్తోంది. ఈ పిచ్ కాస్త గడ్డి ఉంటుందని అంచనా వేసాం. కానీ వికెట్‌పై ఎలాంటి గడ్డి లేదు. దాంతో పిచ్ సమతూకంగా కనిపిస్తోంది. దాంతో ఇద్దరు పేసర్లతో పాటు షోయబ్ బషీర్, టామ్ హార్ట్‌లీని కొనసాగించడం బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తోంది. అయితే మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ పిచ్ ఎలా స్పందిస్తుందోనని మాత్రం కచ్చితంగా చెప్పలేం.
ఈ సిరీస్‌లో మేం గట్టి పోటీనిచ్చాం. భారత్ మా కంటే కాస్త మెరుగైన ప్రదర్శన చేయడంతో విజేతగా నిలిచింది. 3-1తో ఓడిపోవడం చూస్తే మేం దారుణంగా విఫలమయ్యామని భావిస్తారు. కానీ మేం ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేశాం. ఆశించిన ఫలితాలు రానప్పటికీ మా ఆటతీరులో పురోగతి కనబర్చాం. 3-1, లేదా 4-1 కంటే 3-2 మా మెరుగైన ప్రదర్శనకు ప్రతిబింబంగా ఉంటుంది. కాబట్టి చివరి మ్యాచ్‌ను ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.
లూజ్ మోషన్స్‌తో ఇబ్బంది పడుతున్న ఆఫ్ స్పిన్నర్ బిషీర్, పేసర్ ఓలీ రాబిన్సన్‌లను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచాం. ఈ ఇద్దరూ మ్యాచ్‌కు ముందు రోజే స్టమక్ అప్‌సెట్‌తో బాధపడుతున్నారు. దాంతో వారిని ఆడించే రిస్క్ చేయడం లేదు.'అని స్కోక్స్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లండ్ ప్రకటించిన తుది జట్టులో షోయబ్ బషీర్ పేరు ఉంది. ఓలీ రాబిన్సన్ స్థానంలో మాత్రం మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు.