
ఫైనల్లో పాక్ X ఇంగ్లండ్..
అంతేగాకుండా ఈ మెగాటోర్నీలో ఫైనల్ చేరే జట్లను కూడా అంచనా వేసాడు. ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య టైటిల్ ఫైట్ జరుగుతుందా? అని ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. స్టోక్స్ చెప్పినట్లే జరిగితే ఇంగ్లండ్‌కే నష్టం జరుగుతుందంటున్నాడు. ఇంగ్లండ్‌పై గెలిచి పాకిస్థాన్ కసితీర్చుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే తమ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన న్యూజిలాండ్‌కు బాబర్ సేన దిమ్మతిరిగే సమాధానమిచ్చిందని, నెక్ట్స్ ఇంగ్లండ్ కోసమే ఎదురు చూస్తుందని హెచ్చరిస్తున్నారు. పాక్‌కు ఇప్పుడు భారత్ కంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లే శతృదేశాలయ్యాయని కామెంట్ చేస్తున్నారు.

నాలుగు సిక్స్‌లతో..
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 24 పరుగులు కావాలి. బౌలర్ ఎవరైనా ఇది అంత సులువు కాదు. పైగా అంతకుముందు ఓవర్లో 2 పరుగులే రావడంతో పాక్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించడం ఖాయమనిపించింది. కానీ ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 4 సిక్సర్లతో 25 నాటౌట్) పాక్ రాత మార్చేశాడు. కరీమ్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. అతను వరుసగా 6, 0, 6, 0, 6, 6 పరుగులు సాధించాడు. దాంతో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో విజయంతో పాక్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైంది.

బాబర్ హాఫ్ సెంచరీతో..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. గుల్బదిన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్), నబీ (32 బంతుల్లో 5 ఫోర్లతో 35 నాటౌట్) రాణించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు. పాక్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు సాధించి 6 బంతులు మిగిలుండగానే గెలిచింది. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 బం తుల్లో 4 ఫోర్లతో 51), ఫఖార్ జమాన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) బాధ్యతాయుతంగా ఆడారు.

ఇంగ్లండ్ జోరు..
గ్రూప్-1లో ఉన్న ఇంగ్లండ్.. రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి మెరుగైన రన్‌రేట్‌తో టాపర్‌గా కొనసాగుతోంది. వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించిన ఆ జట్టు.. నేడు సాయంత్రం పటిష్టమైన ఆసీస్‌తో తలపడుతుంది. ఆసీస్ కూడా.. సౌతాఫ్రికా, శ్రీలంకపై విజయం సాధించి జోరు మీదుంది. మరోవైపు ఈ గ్రూప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి తప్పుకోగా.. ఒక్కో విజయం సాధించిన విండీస్, శ్రీలంక రేసులో ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంటే సెమీస్‌లోనే పాక్‌తో తలపడవచ్చు.


Click it and Unblock the Notifications












