ఇంగ్లండ్ తాగుబోతుల టీమ్ కాదు.. క్రికెట్‌లోనే తాగుడు కల్చర్ ఉంది: బెన్ స్టోక్స్
క్రికెట్‌లోనే తాగుడు కల్చర్ ఉందని ఇంగ్లండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ మారినా.. ఆటగాళ్లు మాత్రం తాగుడును వదిలేయలేదని చెప్పాడు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రమే ఆల్కహాల్ తీసుకోవడం లేదని, ఇతర జట్ల ఆటగాళ్లకు కూడా ఈ వ్యసనం ఉందని పేర్కొన్నాడు. 1980 నుంచే క్రికెటర్లకు ఆల్కహాల్ వ్యసనంగా మారిందని అభిప్రాయపడ్డాడు.
ఇటీవలే బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ అనంతరం ఓ నైట్‌క్లబ్‌లో పీకలదాక తాగిన బెన్ స్టోక్స్.. ఓ రగ్బీ ప్లేయర్‌తో గొడవపడటం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రెండో టెస్ట్‌కు బెన్ స్టోక్స్‌ను దూరంగా ఉంచింది.
ఇంగ్లండ్ టీమ్ మాత్రమే కాదు..
తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెన్ స్టోక్స్‌ను తాగుడు గురించి ప్రశ్నించగా..ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ జట్టుకు ఆల్కహాల్ వ్యసనంగా మారిందా? అనే వాదనను అతను తోసిపుచ్చాడు. 'ఇంగ్లండ్ జట్టుపై మాత్రమే అలాంటి ముద్ర వేయడం సరికాదు. క్రికెట్‌లోనే తాగుడు కల్చర్ ఉంది. అది ఇప్పటికీ మారలేదు. కాలంతో పాటు ఆట కూడా ప్రోఫెషనల్‌గా మారింది. కానీ మారని ఏకైక విషయం క్రికెట్‌కు మద్యంతో ఉన్న సంబంధం.

క్లబ్ క్రికెట్ నుంచి మద్యం తాగడం పాతుకుపోయింది. మరింత సైన్స్, మెరుగైన వైద్యం, సరైన పోషకాహరం, గొప్ప వృత్తి నైపుణ్యంతో ఆట అభివృద్ది చెందినా.. ఆటగాళ్లు మద్యాన్ని మాత్రం వదల్లేదు. కాబట్టి ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మాత్రమే ప్రత్యేకంగా తాగే కల్చర్ ఉందని అంటే నేను ఒప్పుకోను.
తాగిన ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కొన్నా..
ఒక క్రీడగా క్రికెట్‌కు మద్యంతో ముడిపడిన సంస్కృతి ఉంది. నేను మద్యం సేవించిన ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మద్యందో నా సంబంధం సమస్య కాదు. ప్రమాదకరం. 1980 నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు మద్యానికి మధ్య ఉన్న సంబంధం అలాగే ఉంది. మాజీ క్రికెటర్లను గమనిస్తే చాలా మందికి మద్యంతో ముడిపిన అనారోగ్యకరమైన సమస్యలు ఉన్నాయనే విషయం తెలుస్తోంది. ఈ కల్చర్‌ను మార్చడానికి ఏం చేయాలో నాకు నిజంగా తెలియదు.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

