న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: స్టోక్స్, ఆర్చర్ ఆగయా.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ ఇదే!

 Ben Stokes, Jofra Archer Return To Englands Squad For First Two Tests against India

కొలంబో: భారత్​తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం 16 మంది సభ్యుల జట్టుతో పాటు ఆరుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటనకు విశ్రాంతి ఇచ్చిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చారు. పెటర్నిటీ లీవ్ మీద శ్రీలంక పర్యటనకు దూరమైన రోరీ బర్న్స్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Ind vs Eng Test Series : India Announce Squad For First Two Tests Against England | Oneindia Telugu

జానీ బెయిర్​ స్టో, సామ్ కర్రన్, మార్క్​ వుడ్​లకు జట్టులో చోటు దక్కలేదు. ఒల్లీ పోప్..​ ఫిట్​నెస్​ సాధించిన అనంతరం జట్టుతో చేరుతాడని ఇంగ్లండ్ క్రికెట్​ బోర్డు తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న మొయిన్ అలీకి కూడా అవకాశం దక్కింది.

ఇంగ్లండ్ జట్టు: జో రూట్​(కెప్టెన్​), రోరీ బర్న్స్, డామ్​ సిబ్లీ, జోఫ్రా ఆర్చర్​, జోస్​ బట్లర్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, జాక్​ క్రావ్లే, ఒల్లీ స్టోన్​, జేమ్స్​ అండర్సన్​, బెన్​ స్టోక్స్​, క్రిస్​ వోక్స్, డామ్ బెస్, డాన్ లారెన్స్, స్టువర్ట్ బ్రాడ్​, జాక్​ లీచ్.

రిజర్వు ఆటగాళ్లు: జేమ్స్ బ్రాసీ, మాసోన్ క్రేన్​, సకీబ్​ మహమూద్​, మాట్​ పార్కిన్సన్​, ఒల్లీ రాబిన్సన్​, అమర్​ విర్ది.

Story first published: Thursday, January 21, 2021, 20:36 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X