సత్తా చాటారు: టాప్-10లో బుమ్రా, రెండో స్థానానికి ఎగబాకిన బెన్ స్టోక్స్

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఐసీసీ మంగళవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకుల్లో ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ రెండో స్థానానికి ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన సంగతి తెలిసిందే.
మరోవైపు వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల హాల్ తీసిన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకిన బెన్ స్టోక్స్
ఐసీసీ మంగళవారం ప్రకటించిన బ్యాట్స్‌మన్ ర్యాంకుల్లో 693 పాయింట్లతో బెన్ స్టోక్స్ 13 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక, ఆల్ రౌండర్ల జాబితాలో 411 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండిస్‌కు చెందిన జాసన్ హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్-10లోకి బుమ్రా
ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 774 పాయింట్లతో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో నంబర్ స్థానంలో నిలిచాడు. మరో భారత పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకులో నిలిచాడు. 671 రేటింగ్ పాయింట్లతో ఇషాంత్ శర్మ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. ఇక, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సైతం 43వ ర్యాంకుతో తన అంతర్జాతీయ టెస్టు అరంగేట్రాన్ని ప్రారంభించాడు. కేవలం రెండు టెస్టులకే ఆర్చర్ ఈ ర్యాంకుని అందుకున్నాడు.
అచ్చం బుమ్రాలాగే: మొన్న బుడ్డోడు.. నిన్న బామ్మ... నేడు బంగ్లా యువ బౌలర్

టాప్-5లో ట్రెంట్ బౌల్ట్
శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 250 టెస్టు వికెట్లు తీసిన న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఇక, ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఎప్పటిలాగే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీదే అగ్రస్థానం
బ్యాట్స్‌మన్ జాబితాలో మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కొలంబో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఆరో స్థానంలో నిలవగా... యాషెస్ సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఏడో స్థానానికే పరిమితమయ్యాడు.

11వ స్థానంలో రహానే
మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్, అజ్యింకే రహానేలు తమ ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. టామ్ లాథమ్ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలవగా... రహానే పది స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. ఇక, టీమిండియా ఆటగాడు హనుమ విహారి నలభై స్థానాలు ఎగబాకి 70వ ర్యాంకులో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications