అచ్చం బుమ్రాలాగే: మొన్న బుడ్డోడు.. నిన్న బామ్మ... నేడు బంగ్లా యువ బౌలర్

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా... భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే అతడు టాప్ బౌలర్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైనా సరే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో బుమ్రాది ప్రత్యేకశైలి.
బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. బుమ్రా బంతిని పట్టుకునే విధానం నుంచి రనప్ వరకు మ్యాచ్ చూసేవారిని ఆకర్షిస్తోంది. దీంతో బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించే వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మొదట్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో బుమ్రా బౌలింగ్ శైలిని ఓ బుడ్డోడు అనుకరించాడు.
బుడ్డోడు అచ్చం బుమ్రాలాగే
ఆస్ట్రేలియాకు చెందిన ఆ బుడ్డోడు అచ్చం బుమ్రాలా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నిస్తోన్న వీడియోను క్వీన్స్‌లాండ్‌కు చెందిన మైకెల్ కర్టిన్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. "బుమ్రా.. మీరు సాధించిన సిరీస్ విజయం వల్ల వచ్చిన ఏకైక సమస్య ఏంటంటే.. రేపటి తరం ఆసీస్ క్రికెటర్లను నువ్వు ఇన్‌స్ఫైర్ చేశావు" అంటూ ఆ ఫోటోకు కామెంట్ పెట్టాడు. దానికి ప్రతిగా బుమ్రా సైతం "పిల్లాడు చాలా క్యూట్‌గా ఉన్నాడు, నా అభినందనలు తెలపు" అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు.
బుమ్రా అద్భుత ప్రదర్శన
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా బౌలింగ్ చూసి ఓ బామ్మ గారైతే అచ్చం బుమ్రా లానే బౌలింగ్ యాక్షన్ చేసి చూపించింది. ఆ బామ్మ బౌలింగ్ చేసిన విధానాన్ని ఆమె కూతురు వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారి బుమ్రాకు చేరింది. ఈ వీడియో చూసిన బుమ్రా రీట్వీట్ చేస్తూ 'దిస్ మేడ్ మై డే' అని పేర్కొన్నాడు.
బుమ్రాను అనుకరిస్తోన్న బంగ్లా యువ బౌలర్
ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువ బౌలర్ బుమ్రాను అనుకరిస్తున్నాడు. అచ్చం బుమ్రా ఎలాగైతే బంతిని పట్టుకుంటాడో అదేవిధంగా పట్టుకోవడమే కాదు... అతడి రనప్ సైతం బుమ్రాని తలపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్ బుక్‌లో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications