శార్దూల్ ఠాకూర్ సిక్స్‌కు బిత్తరపోయిన స్టోక్స్.. ఇదేం బ్యాట్ అంటూ చెకింగ్ (వీడియో)

పుణె: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా లోయరార్డర్ బ్యాట్స్‌మన్ శార్దూల్ ఠాకూర్(21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎవరా? అనేది సంబంధం లేకుండా చెలరేగాడు. అయితే బెన్ స్టోక్స్ వేసిన 45వ ఓవర్ శార్దూల్ కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ సిక్స్‌కు డగౌట్‌లోని భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ చప్పట్లు కొట్టారు. బౌలర్ బెన్ స్టోక్స్ అయితే ఆ షాట్‌ను చూసి బిత్తరపోయాడు. ఇదేం బ్యాట్ అంటూ శార్దూల్ దగ్గరకు వెళ్లి మరి బ్యాట్‌ను పరిశీలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
45వ ఓవర్ వేసిన బెన్ స్టోక్స్ నాలుగో బంతిని ఔట్ సైడ్ అఫ్ స్టంప్ దిశగా వేసాడు. ఆ బంతిని శార్దూల్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చీ లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్‌కు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. తాను వేసిన మంచి లెంగ్త్ బాల్‌ను కూడా శార్ధూల్ సిక్సర్‌గా మలచడం చూసి అవాక్కయ్యాడు. అదే సమయంలో నాన్‌స్టైకింగ్ ఎండ్‌లోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ దగ్గరకు వెళ్లి మరీ బ్యాట్‌ను పరిశీలించాడు. ఆ సూపర్ సిక్స్ ఎలా సాధ్యమైందని నవ్వుతూ ప్రశ్నించిన స్టోక్స్.. బ్యాట్‌ను పట్టుకుని మరీ చెక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 11 సిక్స్‌లు కొట్టగా అందులో పంత్, హార్దిక్‌లు తలో నాలుగు సిక్స్‌లు కొట్టారు. మిగతా మూడు శార్దూల్ బ్యాట్ నుంచి వచ్చినవే.

చెలరేగిన పంత్, పాండ్యా
రిషభ్ పంత్(62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), హార్దిక్ పాండ్యా(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64), శిఖర్ ధావన్(56 బంతుల్లో 10 ఫోర్లతో 67) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌కు పంత్-పాండ్యా మెరుపులు తోడవడంతో భారత్ ఓ దశలో 350 పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక లివింగ్‌స్టన్, మోయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కరన్, టోప్లీ తలో వికెట్ తీశారు.

కష్టాల్లో ఇంగ్లండ్..
330 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు జాసన్ రాయ్(14), బెయిర్ స్టో(1)లను పెవిలియన్ చేర్చి భువనేశ్వర్ మంచి ఆరంభాన్ని అందివ్వగా.. క్రీజులో కుదురుకుంటున్న బెన్ స్టోక్స్‌ను నటరాజన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్(15)ను శార్దూల్ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్(35), డేవిడ్ మలాన్(50) పోరాడారు. అయితే ఈ ఇద్దర్ని శార్దూల్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications