మద్యం మత్తులో వీరంగం.. బెన్ స్టోక్స్‌పై నిషేధం!
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చిక్కుల్లో పడ్డాడు. సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి వీరంగం సృష్టించాడు. జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి తర్వాత క్లబ్‌కు వెళ్లిన ఈ ఇద్దరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) విచారణ చేపట్టింది. అయితే ఈ ఇద్దరు దోషులుగా తేలితే బోర్డు నిబంధనల ప్రకారం నిషేధం పడనుంది.
అసలేం జరిగిందంటే?
లండన్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు విజయానంతరం బెన్ స్టోక్స్, అట్కిన్సన్ అర్ధరాత్రి తర్వాత ఓ నైట్ క్లబ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సారాసెన్స్ అకాడమీకి చెందిన ఓ రగ్బీ ప్లేయర్‌తో గొడవ పడినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. అట్కిన్సన్‌పై ఆ ఆటగాడు చేయి చేసుకోగా.. అది పొరపాటున ఇంగ్లండ్ జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరికి తగిలినట్లు తెలుస్తోంది. గాయపడిన సెక్యూరిటీ గార్డుకు అత్యవసర చికిత్స అందించారని, ఈ ఘర్షణలో స్టోక్స్, అట్కిన్సన్ దాడికి పాల్పడలేదని ఈసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

బెన్ స్టోక్స్ కెప్టెన్సీపై వేటు..
ఈ ఘటనను ఈసీబీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఈసీబీ విచారణకు ఆదేశించింది. జూన్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే బెన్ స్టోక్స్‌పై ఈసీబీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
స్టోక్స్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించే అవకాశాలు ఉన్నట్లు బ్రిటీష్ మీడియా కోడై కూస్తోంది. స్టోక్స్‌పై వేటు పడితే.. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా తప్పతాగి గొడవకు దిగడం ఇదే తొలిసారి కాదు.
గతంలో ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇలానే ఇంగ్లండ్ ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాతే అర్థరాత్రి ఆటగాళ్లు బయటకు వెళ్లొద్దని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనను తీసుకొచ్చింది. కానీ స్టోక్స్, అట్కిన్సన్ నిబంధనలను ఉల్లంఘించడం వివాదానికి దారితీసింది.
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ అనంతరం జట్టు నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఆదేశించామని ఈసీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది. 'సోమవారం తెల్లవారుజామున ఒక నైట్‌క్లబ్‌లో చోటు చేసుకున్న ఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ భాగంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఎంపిక చేసే జట్టుకు సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తాం. ఈ విషయం గురించి క్రికెట్ రెగ్యులేటర్‌కు సమాచారం అందించాం. వీలైనంత త్వరగా మరిన్ని అప్‌డేట్స్ ఇస్తాం.'అని ఈసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications