అతని వల్లే ఈ ఘోర పరాజయం: బెన్ స్టోక్స్
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తోనే రెండో టెస్ట్‌లో ఓటమిపాలయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను సుదీర్ఘ బ్యాటింగ్ చేయడంతో తమ బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారని, ఎంత పుంజుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌటైంది. ఆకాశ్ దీప్(6/99) సంచల బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీతో రాణించిన శుభ్‌మన్ గిల్(269, 161)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఆ రెండు తప్పిదాలే..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బెన్ స్టోక్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని సమర్థించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపాడు. ముఖ్యంగా రెండు తప్పిదాలు తమ విజయవకాశాలను దెబ్బతీసాయని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో రెండు క్షణాలు కీలకంగా మారాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 200/5 కట్టడి చేసినప్పుడు మేం చాలా సంతోషించాం. కానీ వారిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయాం. మా బ్యాటింగ్ సమయంలో 80 పరుగులే 5 వికెట్లు కోల్పోయాం. అక్కడి నుంచి తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. ఈ రెండు తప్పిదాలే మా విజయవకాశాలను దెబ్బతీసాయి.

పుంజుకోలేకపోయాం..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కష్టమైన నిర్ణయమే. కానీ నేను ముందుగా చెప్పినట్లు ప్రత్యర్థిని 200/5 కట్టడి చేశాం. అప్పుడు అందరూ సంతోషించారు. కానీ ఆట జరుగుతున్నా కొద్దీ పరిస్థితులు మా కంటే భారత్‌కే ఎక్కువ అనుకూలించాయి. ఈ మ్యాచ్‌లో మా కంటే భారత పేసర్లు మెరుగైన ప్రదర్శన చేయడంపై ఎలాంటి ఆందోళన లేదు. మేం కూడా ప్రతిదీ ప్రయత్నించాం. ప్రణాళికలను మార్చాం. జట్టు విజయం కోసం చేయగలిగినదంతా చేశాం. కానీ ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు తిరిగి మూమెంటమ్ అందుకోవడం చాలా కష్టం. అది వరల్డ్ బెస్ట్ టీమ్ అయిన భారత్‌పై మరీ కష్టం.
గిల్ బ్యాటింగ్ అద్భుతం..
శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అసాధారణ బ్యాటింగ్‌తో మా పతనాన్ని శాసించాడు. సుదీర్ఘమైన మ్యాచ్‌లో ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మా ఆటగాళ్లంతా పూర్తిగా అలసిపోయారు. అయితే ఇది మళ్లీ మళ్లీ ఎదుర్కొనే పరిస్థితి. ఇందుకు అలవాటు పడాలి. జెమీ స్మిత్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందకున్నా.. బ్యాట్‌తో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సహజమైన ఆటతో చెలరేగుతున్నాడు. హ్యారీ బ్రూక్ ఆడిన విధానం అద్భుతం. అతని ప్రదర్శన మా విజయానికి సరిపోకపోయినా గొప్పది. ఈ ఓటమి గురించి చర్చిస్తాం. ఈ వారం మాకు కఠినంగా గడిచింది. . లార్డ్స్‌లో ఎలా పుంజుకుంటామో చూడాలి.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)
భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్‌మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 271 ఆలౌట్( జెమీ స్మిత్ 88, ఆకాశ్ దీప్ 6/91)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications