Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ రేర్ రికార్డ్!

హైదరాబాద్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ విజయంతో బెన్ స్టోక్స్ ఈ ఫీట్ సాధించాడు. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. ఒక్క ఇన్నింగ్స్‌ మాత్రమే ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయగా టాప్-4 బ్యాటర్లే చెలరేగారు. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న బెన్ స్టోక్స్ చాలా రోజులుగా బౌలింగ్ చేయడం లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినా.. యాషెస్ సిరీస్ కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రిస్క్ తీసుకోలేదు. ఈ మ్యాచ్‌ను వామప్‌గా భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ గెలిచారు.

Ben Stokes

ఇక 97/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్.. 86.2 ఓవర్లలో 362 పరుగులకు కుప్పకూలింది. ఆండీ మెక్‌బ్రైన్(115 బంతుల్లో 14 ఫోర్లతో 86 నాటౌట్), మార్క్ అడైర్(76 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88) హాఫ్ సెంచరీలతో రాణించారు. 162 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను ఈ ఇద్దరు ఆదుకున్నారు.

అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఏడో వికెట్‌కు 163 పరుగులు జోడించారు. దాంతో ఇంగ్లండ్ విజయం ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడినా.. ఆ జట్టు టెయిలెండర్స్ ఇంగ్లండ్ బౌలర్లను సతాయించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/66) ఐదు వికెట్లతో చెలరేగగా.. స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్, జాక్ లీచ్, జోరూట్ తలో వికెట్ తీసారు.

ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం తీసేయగా.. ఇంగ్లండ్ ముందు 11 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. ఇంగ్లండ్ నాలుగు బంతుల్లోనే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. జాక్ క్రాలీ ఒక్కడే ఈ నాలుగు బంతులు ఆడి మూడు బౌండరీలతో విజయాన్నందించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. స్టువర్ట్ బ్రాడ్(5/51) ఐదు వికెట్లతో ఐర్లాండ్ పతనాన్ని శాసించగా.. జాక్ లీచ్ మూడు వికెట్లు తీసాడు.

మాథ్యూ పోట్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఐర్లాండ్ బ్యాటర్లలో జేమ్స్ మెక్‌కల్లమ్(36), కుర్టిస్ కాంఫెర్(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓలిపోప్(208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 205) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌ను 524/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఓలిపోప్‌కు తోడుగా బెన్ డక్కెట్(178 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 182) సెంచరీతో మెరిసాడు. ఓపెనర్ జాక్ క్రాలీ(45 బంతుల్లో 11 ఫోర్లతో 56), జోరూట్(59 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గ్రహమ్ హుమే, ఫియోన్ హ్యాండ్ తలో వికెట్ తీయగా.. ఆండీ మె‌క్‌బ్రైన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, June 3, 2023, 22:43 [IST]
Other articles published on Jun 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+