మంగళవారమే నా చివరి మ్యాచ్..
'ఇంగ్లండ్ తరఫున నా చివరి వన్డే మ్యాచ్‌ను డర్హామ్ వేదికగా మంగళవారం ఆడనున్నాను. వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. వన్డే క్రికెట్‌లో నా సహచరులతో కలిసి ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌లో నాది అద్భుతమైన ప్రయాణం. ఈ ఫార్మాట్‌లో మునపటిలా 100 శాతం ప్రదర్శన ఇవ్వలేననే ఈ నిర్ణయం తీసుకున్నాను. మూడు ఫార్మాట్లను సమన్వయం చేయడం నావల్ల కావడం లేదు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లు ఆడేందుకు నా శరీరం సహకరించడం లేదు. మొండిగా జట్టులో కొనసాగడం వల్ల జట్టుకు నష్టం జరుగుతోంది.

టీ20 క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలని..
నేను తప్పుకుంటే నా స్థానంలో వచ్చే ఆటగాడు జోస్ బట్లర్‌కు అండగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో గత 11 ఏళ్లుగా నాకు అపురూపమైన జ్ఞాపకాలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో నా సాయశక్తులా రాణించేందుకు కృషి చేస్తా. వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో టీ20 క్రికెట్‌పై కూడా మరింత ఫోకస్ పెడతా. జోస్ బట్లర్, మాథ్యూ మోట్ వన్డే ఫార్మాట్ ఆటగాళ్లంతా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. గత ఏడేళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది.

ఇంగ్లండ్ అభిమానుల మద్దతు..
నేను ఇప్పటి వరకు ఆడిన మొత్తం 104 వన్డేల్లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నాకిష్టమైన, హోమ్ గ్రౌండ్ అయిన డర్షామ్‌లో చివరి వన్డే ఆడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఎప్పటిలాగానే ఇంగ్లండ్ అభిమానులకు నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. ఇదే ప్రేమ, అప్యాయతలు కనబరుస్తారని కోరుకుంటున్నా. మంగళవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఆశిస్తున్నా'అని బెన్ స్టోక్స్ ఓ సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

భారత్ చేతిలో ఓటమితో..
ఐర్లాండ్‌తో 2011లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డే మ్యాచ్‌లు ఆడి 39.44 సగటుతో 2919 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో 74 వికెట్లు తీసాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా భారత్‌తో వన్డే సిరీస్ 2-1తో కోల్పోవడాన్ని స్టోక్స్ జీర్ణించుకోలేకపోయాడు.


Click it and Unblock the Notifications












