ENG vs NZ: బెన్ స్టోక్స్, అట్కిన్సన్‌పై వేటు.. కెప్టెన్‌గా జోరూట్!
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు ఈ ఇద్దరి ఆటగాళ్లను దూరంగా ఉంచిన ఈసీబీ.. తాత్కలిక కెప్టెన్‌గా జోరూట్‌ను నియమించింది.
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ విజయానంతరం బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ టీమ్ రూల్స్‌ను ఉల్లంఘించి అర్ధరాత్రి ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ఇద్దరూ పీకలదాక మద్యం తాగి ఓ రగ్బీ ప్లేయర్‌తో గొడవకు దిగారు. ఈ గొడవలో ఇంగ్లండ్ సెక్యూరిటీ ఆఫిసర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీబీ.. విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే రెండో టెస్ట్ ఆడకుండా ఈ ఇద్దరిపై నిషేధం విధించింది.

'నైట్‌క్లబ్ ఉదంతంపై ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతోంది. ఈ విచారణ సాగుతున్న నేపథ్యంలో జూన్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు బెన్ స్టోక్స్‌తో పాటు గస్ అట్కిన్సన్‌ను దూరంగా ఉంచింది.'అని ఈసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.
బజ్‌బాల్ యుగంలో ఇంగ్లండ్ జట్టుకు జోరూట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. 2022లో జోరూట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం కలిగిన జోరూట్ కెప్టెన్‌గా కొనసాగడం ఉత్తమమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది.
బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌లపై వేటు పడటంతో జోఫ్రా ఆర్చర్, జోర్డాన్ కాక్స్‌లకు అవకాశం దక్కింది. గాయం కారణంగా ఇప్పటికే రెండు సార్లు అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయిన జోర్డాన్ కాక్స్.. ఈ ఓవల్ టెస్ట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోఫ్రా ఆర్చర్ తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. అట్కిన్సన్ గైర్హాజరీలో అతను బరిలోకి దిగనున్నాడు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు ఇంగ్లండ్ టీమ్: జోరూట్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రీవ్, ఓలీ రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ డన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

