For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: బెన్ స్టోక్స్

బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ ఆసీస్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఆఖరి టెస్ట్ అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో అదనంగా 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఆస్ట్రేలియాకు కూడా తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు తక్కువగా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

100 పరుగులు చేసుంటే..

'నా కాలు గాయం కాస్త మెరుగ్గానే ఉంది. కొన్నిసార్లు తీవ్ర నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఇంటికి వెళ్లే వరకు ఈ గాయంపై స్పష్టత రాదు. ఈ మ్యాచ్‌లో ఓడినా భాగమవ్వడం ఒక గొప్ప అనుభూతి. మేం తొలి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు అదనంగా చేసి ఉండాల్సింది. అలాగే ఆస్ట్రేలియా 100 పరుగులకు తక్కవకే కట్టడి చేయాల్సింది.

ఆస్ట్రేలియా అద్భుతమైన జట్టు. అందులో వ్యక్తిగత ప్రదర్శనలతో జట్టును ఆదుకునే ఆటగాళ్లు ఉన్నారు. ఈ విజయం క్రెడిట్ పూర్తిగా వారికే దక్కుతుంది. అయితే ఈ సిరీస్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. మా లోపాలను సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఈ ఓటమిని విశ్లేషించుకోవడానికి మాకు చాలా సమయం ఉంది. వచ్చే జూన్‌లో మేం మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడనున్నాం. ఆ సమయానికి మా తప్పులను సరిదిద్దుకుంటాం.

ఈ మ్యాచ్‌లో జాకోబ్ బెత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. జోష్ టంగ్ ప్రదర్శన రోజురోజుకూ మెరుగవుతుంది. అతను నిలకడగా రాణిస్తున్నాడు. మా జట్టులో అసాధారణ ఆటగాళ్లు ఉన్నారు.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో ఓడినా కెప్టెన్‌గా కొనసాగుతానని తెలిపాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.

Ben Stokes Admits England Fell Short After Sydney Test Loss to Australia

ఆసీస్ ఘన విజయం..

302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 88.2 ఓవర్లలో 342 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో జాకోబ్ బెతెల్( 265 బంతుల్లో 15 ఫోర్లతో 154)‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు.

జోష్ టంగ్(6) సాయంతో మాథ్యూ పోట్స్(18 నాటౌట్) కాసేపు పోరాడినా.. మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. జోష్ టంగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/72), బ్యూ వెబ్‌స్టార్(3/64)మూడేసి వికెట్లు తీయగా.. మైఖేల్ నేసర్ ఒక వికెట్ పడగొట్టాడు. స్కాట్ బోలాండ్‌ రెండు వికెట్లు తీసాడు.

183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా ముందు 160 పరుగుల లక్ష్యం నమోదైంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ 31.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(29), జాక్ వెదరాల్డ్(34), మార్నస్ లబుషేన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(3/42) మూడు వికెట్లు తీయగా.. విల్ జాక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 384 ఆలౌట్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 567 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 342 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 161/5

Story first published: Thursday, January 8, 2026, 12:09 [IST]
Other articles published on Jan 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+