Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. 42 ఏళ్లలో ఒకే ఒక్కడు!

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్‌గా నిలిచాడు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో 164 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా స్టోక్స్ ఈ ఫీట్ సాధించాడు. ఈ శతకంతో స్టోక్స్ రికార్డుల మోత మోగించాడు. సిరాజ్ వేసిన 146వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించి స్టోక్స్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. స్టోక్స్‌కు ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

ఒక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో పాటు సెంచరీ చేసిన ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. గత 42 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ అందుకున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం డెన్నిస్ అట్కిన్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1955లో ఆస్ట్రేలియాపై డెన్నిస్ అట్కిన్సన్ ఈ ఫీట్ సాధించాడు. గ్యారీ సోబెర్స్(1996లో ఇంగ్లండ్‌పై), మస్తాక్ మహమ్మద్(1977లో వెస్టిండీస్‌పై), ఇమ్రాన్ ఖాన్(1983లో భారత్‌పై) ఈ ఫీట్ సాధించారు. ఇన్నాళ్లకు భారత్‌పై బెన్ స్టోక్స్ ఈ ఘనతను అందుకున్నాడు.

Ben Stokes Achieves Rare Feat First Captain in 42 Years with Test Century amp amp Five-Wicket Haul

ఈ మ్యాచ్‌లోనే బెన్ స్టోక్స్‌ టెస్ట్‌ల్లో 7వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టి ఈ ఫీట్ సాధించాడు. టెస్ట్‌ల్లో 200 ప్లస్ వికెట్లతో పాటు 7000 రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్(8032& 235 వికెట్లు), జాక్వస్ కల్లీస్(13289 & 292 వికెట్లు), బెన్ స్టోక్స్(7000*& 229* వికెట్లు) కంటే ముందున్నారు.

544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో ఈ మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. దాంతో డ్రా చేసుకోవడం మినహా భారత జట్టుకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.

Story first published: Saturday, July 26, 2025, 16:55 [IST]
Other articles published on Jul 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+