For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

18 ఫోర్లు, 8 సిక్సులతో విధ్వంసం

ఇంగ్లండ్ అండర్ 19 ప్లేయర్ బెన్ మాయెస్ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెన్ మాయెస్(117 బంతుల్లో 18 ఫోర్లు, 8 సిక్స్‌లతో 191) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 18 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీర విహారం చేసిన మాయోస్.. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లండ్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి స్థానంలో శ్రీలంక ప్లేయర్ విరాన్(192) ఉన్నాడు. మూడో స్థానంలో కూడా శ్రీలంకకు చెందిన బోయగోడ కొనసాగుతున్నాడు.

Ben Mayes Smashes Record 191 as England Dominate at U19 World Cup

బెన్ మాయెస్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 252 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాయెస్‌కు తోడుగా జోసెఫ్ మూరెస్(65 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్ హౌస్(3/88) మూడు వికెట్లు తీయగా.. ఫిన్లే జోన్స్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. మాక్స్ చాప్లిన్(1/49) ఒక వికెట్ తీసాడు.

అనంతరం స్కాట్లాండ్ 44.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ అండర్ 19 బౌలర్లలో ఫాల్కోనర్ మూడు వికెట్లు తీయగా.. అల్బెర్ట్, మన్ని రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Wednesday, January 21, 2026, 18:34 [IST]
Other articles published on Jan 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+