ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ సిక్సర్లతో సన్‌రైజర్స్ రికార్డ్ స్కోర్స్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మది కీలక పాత్ర.
అతని ప్రభావం ఆరెంజ్ ఆర్మీపై చాలా ప్రభావం చూపించింది. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ విఫలమవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ మొత్తం 42 సిక్స్‌లు బాది అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ వెనుక ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో పాటు సిక్సర్ల సింగ్ యువరాజ్ ఉన్నారు.

పాంటింగ్ చెప్పిన మాటతో..
17 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అభిషేక్ శర్మ.. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాతి మ్యాచ్‌లో ఓ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు.
ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మ దగ్గరకు వచ్చి 'ఈ షాట్ మళ్లీ ఆడితే బంతి ప్రేక్షకుల గ్యాలరీల్లోనే పడాలి'అని ప్రోత్సహించాడు. ఆ క్షణం అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ మొదలైంది. అప్పటి నుంచి దూకుడే మంత్రంగా అభిషేక్ శర్మ ముందుకు సాగుతున్నాడు.
యువీ గైడెన్సీలో..
పృథ్వీ షా సారథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అభిషేక్ శర్మ సభ్యుడు. ఆ టోర్నీ అనంతరం అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ గైడెన్సీలో మరింత రాటు దేలాడు. అభి స్టాన్స్, షార్ట్ బంతులు ఆడటంలో మెలకువలు, మానసికంగా దృఢంగా మార్చడం.. ఇలా అన్నింటిలో యువీ అండగా నిలిచాడు.
ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువరాజ్ సింగ్ ఆటను గుర్తుకు తెస్తున్నాయి. గతేడాది అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ జట్టుకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఈ టోర్నీలో అభిషేక్ 2 శతకాలతు, 3 హాఫ్ సెంచరీలతో 485 పరుగులు చేశాడు. ఆంధ్రపై 51 బంతుల్లో 112 పరుగులు చేయడంతో ఆ మ్యాచ్‌లో పంజాబ్ 275 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.
నమ్మకం ఉంచడంతో..
2019లో ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చాడు. శిఖర్ ధావన్‌ను ఢిల్లీకి ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ ముగ్గురు కుర్రాళ్లను జట్టులోకి తెచ్చుకుంది. అయితే ఆరంభ సీజన్లలో అభిషేక్ శర్మను లోయరార్డ్‌లో ఆడించడంతో అతను సత్తా చాటలేకపోయాడు.
అయినా అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రిటైన్ చేసుకొని అతన్ని ప్రోత్సహించింది. దాంతో తన విలువ ఏంటో చాటి చెప్పాడు. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుండగా.. సన్‌రైజర్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో అభిషేక్ శర్మ మొదటి స్థానంలో ఉండనున్నాడు.