MS Dhoni కన్నా ముందే హెలికాప్టర్ షాట్.. ఇదిగో వీడియో సాక్ష్యం!

న్యూఢిల్లీ: క్రికెట్‌లో హెలికాఫ్టర్ షాట్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇది అతని ట్రేడ్ మార్క్ షాట్. సుదీర్ఘకాలంగా యార్కర్ బంతులను బౌండరీలకు తరలించడం ఎలానో తెలియక సతమతమవుతున్న బ్యాట్స్‌మన్‌కు మహీ ఓ మార్గం చూపించాడు. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు అద్భుతం.
ధోనీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. కెరీర్ ప్రారంభంలో ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో యువ క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు.
అజారుద్దీన్ హెలికాప్టర్ షాట్..
కష్టతరమైన ఈ వినూత్న షాట్ ఆడాలంటే టైమింగ్‌తో పాటు బ్యాక్ హ్యాండ్ పవర్, ఐ కాంటాక్ట్ కీలకం. అలాగే బంతి లెంగ్త్‌ను కూడా సరిగ్గా అంచనా వేయాలి. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్పా ఈ షాట్ ఆడటం అంత సులువు కాదు. అందుకే ఈ షాట్ ఆడటం ధోనీ ఒక్కడికే సాధ్యమైంది. తన ట్రెడ్ మార్క్ షాట్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ హెలికాప్టర్ షాట్ ధోనీ కన్నా ముందే ఉందనే చర్చ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ తరహా హెలీకాప్టర్ షాట్స్ ఆడాడని ఓ వర్గం అభిమానులు వాదిస్తున్నారు. అతని హెలికాప్టర్ షాట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ను చేస్తున్నారు.

1996 సౌతాఫ్రికాతో...
1996లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అజారుద్దీన్ ఈ షాట్ ఆడాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో అజార్ (77 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ లాన్స్ క్లుసెనర్ వేసిన ఓ ఓవర్‌లో అజారుద్దీన్ ఐదు ఫోర్లు కొట్టాడు. అయితే ఈ ఓవర్‌లో అజారుద్దీన్ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత క్లుసెనర్ యార్కర్ వేస్తాడని భావించిన అజారుద్దీన్.. అతని లెంగ్త్‌ను పసిగట్టి హెలిక్యాప్టర్ షాట్‌తో బంతిని డీప్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఆ మ్యాచ్‌లో క్లుసెనర్‌ను అజారుద్దీన్ చీల్చిచెండాడాడు.

ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు..
అయితే ఈ వీడియో విషయంలో ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అజార్ షాట్ హెలికాప్టర్ షాట్‌లానే ఉన్నా.. అది పూర్తిగా లేదని కొందరంటే.. అది హాఫ్ హెలికాప్టర్ షాట్ అని, అందుకే బంతి సిక్స్‌గా వెళ్లకుండా.. ఫోర్ వెళ్లిందని కామెంట్ చేస్తున్నారు. హెలికాప్టర్ షాట్ ధోనీదేనని, దాని పేటేంట్ అతనిదేనని కామెంట్ చేస్తున్నారు. హెలికాప్టర్ షాట్‌ను ఎంత మంది అనుకరించినా..ధోనీ షాట్ ధోనీదేనని పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications