Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCI net worth ఎంతో తెలుసా? ఆస్ట్రేలియా కంటే 28 రెట్లు ఎక్కువ?

BCCIs Net Worth Over INR 18,700 Crore, it’s 28 times higher than Cricket Australia

BCCI net worth revealed: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డ్. ఒంటి చేత్తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) సైతం భారత క్రికెట్ బోర్డు కనుసన్నల్లోనే పని చేస్తోంది. అందుకే ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐతో కయ్యం పెట్టుకోదు.

తమ ఆదాయం రెట్టింపు చేసుకునేందుకు భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తాయి. భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా భావించడం బీసీసీఐ‌కి కలిసొచ్చింది. అభిమానుల పిచ్చి బోర్డుపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఐపీఎల్‌తో బీసీసీఐ ఆధాయం పదింతలు పెరిగింది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ద్వారానే బీసీసీఐకి 70 శాతం ఆధాయం సమకూరుతోంది అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి బీసీసీఐ నెట్‌వర్త్ ఎంత? అనే విషయాన్ని ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం బీసీసీఐ నెట్‌వర్త్ రూ. 18,700 కోట్లు ( 2.25 బిలియన్ అమెరికా డాలర్లు) గా ఉందని పేర్కొంది. బీసీసీఐకి దగ్గరగా మరే క్రికెట్ బోర్డు లేకపోవడం విశేషం. బీసీసీఐ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 658 కోట్లు(79 మిలియన్ అమెరికా డాలర్లు)తో రెండో స్థానంలో ఉంది.

ఈ లెక్కన ఆసీస్ కంటే బీసీసీఐ నెట్‌వర్త్ 28 రెట్లు ఎక్కువగా ఉంది. ఐపీఎల్ రాకతోనే బీసీసీఐ ఆదాయం అమాంతం పెరిగింది. ప్రస్తుతం భారత్‌కు ఆతిథ్యం ఇస్తున్న సౌతాఫ్రికా 45 మిలియన్ల అమెరికా డాలర్లతో ఆరో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా నికర ఆదాయం బీసీసీఐ నెట్‌వర్త్‌లో 2 శాతం మాత్రమే. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 59 మిలియన్ అమెరికా డాలర్లతో మూడో స్థానంలో ఉండగా.. దాయాదీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 55 మిలియన్ అమెరికా డాలర్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

క్రికెట్ సౌతాఫ్రికాకు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సిరీస్‌లతో భారీ ఆదాయం సమకూరనుందని ఈ రిపోర్ట్ పేర్కొంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లతో క్రికెట్ సౌతాఫ్రికాకు 68.7 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని తెలిపింది. గత మూడేళ్లుగా సౌతాఫ్రికా వరుసగా ఏడాదికి 6.3 మిలియన్, 10.5 మిలియన్, 11.7 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది. భారత పర్యటనతో ఈ నష్టాన్ని భర్తి చేయనుందని సదరు రిపోర్ట్ స్పష్టం చేసింది.

Story first published: Saturday, December 9, 2023, 11:09 [IST]
Other articles published on Dec 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+