
కరోనా దెబ్బతో..
సాధారణంగా ఎక్కడ పర్యటించినా.. అక్కడి ఫస్ట్‌క్లాస్ జట్లతో సన్నాహక మ్యాచులు ఆడటం సంప్రదాయం. అన్ని జట్లు ఇలాగే చేస్తాయి. కానీ కరోనా మహమ్మారి వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో గందరగోళం ఏర్పడింది. పర్యాటక జట్లు క్వారంటైన్‌లో ఉండటం.. ప్రత్యర్థి జట్లు కూడా బయో బుడగలో ఉండాల్సి రావడంతో మ్యాచుల నిర్వహణ కష్టంగా మారడంతో పాటు భారీ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ముందు కూడా సన్నాహక మ్యాచులు ఏర్పాటు చేయలేదు.

ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం..
డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడం, తాము కోరినా ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఎందుకు పెట్టలేదో తమకూ తెలియదని విరాట్ కోహ్లీ తెలపడంతో బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈసీబీ ఛైర్మన్ ఇయాన్ వాట్‌మోర్, సీఈవో టామ్ హ్యారిసన్‌తో సన్నాహక మ్యాచుల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈసీబీకి బీసీసీఐ అధికారిక విజ్ఞప్తి చేసిందని, రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుందని సమాచారం.

భారత్-ఏ..
వాస్తవానికి నార్తాంప్టన్ షైర్, లీసెస్టర్‌షైర్‌తో మ్యాచులు ఆడేందుకు భారత్-ఏ ఇంగ్లాండ్‌కు రావాల్సింది. అలా వచ్చిన భారత్-ఏతో కోహ్లీసేన సన్నాహక మ్యాచులు ఆడేలా మొదట ప్లాన్ చేశారు. కానీ కరోనా పరిస్థితులు, ప్రయాణ ఆంక్షలు, బయో బుడగల భారం వల్ల ఆ మ్యాచులు రద్దయ్యాయి. దాంతో దుర్హమ్‌లో సాధన శిబిరం ఏర్పాటు చేశారు. మూడు వారాల విరామం తర్వాత టీమిండియా అక్కడికి చేరుకుని ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లతో సాధన చేయాల్సి ఉంది. అయితే బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఈసీబీ సన్నాహక మ్యాచులు గనక ఏర్పాటు చేస్తే కోహ్లీసేన విరామం రద్దయ్యే అవకాశం ఉంది.

పెరుగుతున్న కేసులు..
వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్‌లో ఉండే ఆటగాళ్లందరికి బ్రేక్ ఇచ్చారు. బయో బబుల్ ధాటి ఇంగ్లండ్ పరిసర ప్రాంతాలను ఆస్వాదించవచ్చని కూడా పేర్కొన్నారు. కానీ బ్రిటన్‌లో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారేలా ఉందని తెలిస్తే మాత్రం.. ఆటగాళ్లను శిబిరానికి వచ్చేయమని చెబుతారు. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ ఆ దిశగా సంకేతాలిచ్చారు.


Click it and Unblock the Notifications












