ఉగ్రదాడులు ఉండవని గ్యారంటీ ఇస్తుందా?.. పాక్‌కు బీసీసీఐ కౌంటర్!

న్యూఢిల్లీ: తమ ఆటగాళ్ల భద్రతపై లిఖితిపూర్వక హామీ ఇవ్వాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి బీసీసీఐ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి ఉగ్రదాడులు ఉండవని హామీ ఇస్తారా? అని ఎదురు ప్రశ్నించింది. ఇక భారత్‌లో నిర్వహించే 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పీసీబీ ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీసీబీ హామీ ఇప్పించగలదా..?
ఆటలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని ఐసీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని, ఇది క్రికెట్ బోర్డులకు కూడా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో క్రికెట్ బోర్డులు కూడా జోక్యం చేసుకోలేవన్నారు. ‘పాకిస్థాన్ నుంచి భారత్‌లో అక్రమ చోరబాట్లు ఉండవని, కాల్పుల విరమణ ఉల్లంఘణ జరగదని, పాక్ నుంచి భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడులు జరగయని, పుల్వామా వంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కావని, పీసీబీ పాకిస్థాన్ ప్రభుత్వం చేత హామీ ఇప్పించగలదా?'అని సదరు అధికారి ప్రశ్నించారు.

ఏజెంట్‌లా వ్యవహరించడం..
‘క్రికెట్ పరిపాలన వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని ఐసీసీ నిబంధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే క్రికెట్ బోర్డులు కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవు. పీసీబీ ఇది గ్రహించి.. ఐసీసీలో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తికి ఏజెంట్‌లా వ్యవహరించడం మానేయాలి. భారత్ ఓ అద్భుతమైన దేశం. తీసుకునే నిర్ణయాలేవైనా సమతుల్యంగా ఉంటాయి'అని ఆ అధికారి పేర్కొన్నారు.

లిఖిత పూర్వక హామీ కావాలి..
భారత్‌లో జరగనున్న 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల మంజూరుతో పాటు భారత్‌లో ఆడే విషయాలపై స్పష్టతనివ్వాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ సీఈవో వసీమ్‌ఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2021 టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, భారత్‌లో ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేదన్నాడు. ఒకవేళ ఈసారి మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తే దాన్ని 2022లో నిర్వహించే అవకాశం ఉందన్నాడు. అలాగే భారత్‌లో నిర్వహించే ఐసీసీ టోర్నీలకు తమ ఆటగాళ్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు బీసీసీఐ నుంచి భద్రతాపరమైన అంశాలపై లిఖితపూర్వక హామీ కావాలన్నాడు.

గంగూలీనా.. మాకు తెలియదు..
ఇంతకుముందు భారత్‌లో జరిగిన క్రీడా ఈవెంట్లలో పాక్ అథ్లెట్లకు అనుమతులు ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి తాము ముందుగానే హామీ కోరుతున్నట్లు తెలిపాడు. అనంతరం భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్‌పై స్పందించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుప్పుడే ఆ విషయం కొలిక్కి రాదన్నాడు. బీసీసీఐతో పీసీబీకి మంచి సంబంధాలే ఉన్నా వాస్తవికంగా ఇరు జట్ల మధ్య ఇప్పట్లో క్రికెట్ జరగదని స్పష్టంచేశాడు. చివరగా ఐసీసీ ఛైర్మన్ పోటీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నిలబడితే పీసీబీ స్పందనేంటని ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, గంగూలీ బరిలో ఉంటాడో లేదో తమకు తెలీదని సమాధానం దాటవేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications