మళ్లీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ... బుజ్జగిస్తున్న బీసీసీఐ!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌తోనే టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పగా.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. అయితే వన్డే, టీ20 సారథ్యాన్ని కోల్పోయినా.. తనకు నచ్చిన సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 100వ టెస్ట్ మైలురాయికి అడుగు దూరంలో ఉన్న కోహ్లీ.. కెప్టెన్‌గానే ఆ ఘనతను అందుకుంటాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

బీసీసీఐ రిక్వెస్ట్..
అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని భావించిన భారత క్రికెట్ బోర్డు 100వ టెస్ట్ వరకు సారథిగా కొనసాగాలని విరాట్ కోహ్లీని స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసిందంట. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల ప్రకారం విరాట్ కోహ్లీ బెంగళూరు వేదికగా 100వ టెస్ట్ ఆడనున్నాడు. ఇక బెంగళూరు కోహ్లీకి రెండో హోమ్ టౌన్. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు కోహ్లీ సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వేదికగా జరిగే మ్యాచ్‌లో కెప్టెన్‌గా కోహ్లీకి ఘన వీడ్కోలు పలకాలని బీసీసీఐ ప్లాన్ చేసిందంట. అయితే ఈ రిక్వెస్ట్‌ను కోహ్లీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తిరస్కరించిన విరాట్ కోహ్లీ
బీసీసీఐకి చెందిన ఓ అధికారే ఈ విషయాన్ని తెలియజేశాడని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. 'కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సారథిగా విరాట్ కోహ్లీకి ఘన వీడ్కోలు పలకాలని బీసీసీఐ భావించింది. బెంగళూరు వేదికగా జరగనున్న అతని 100వ టెస్ట్‌కు సారథ్యం వహించాలని విజ్ఞప్తి చేసింది. కానీ విరాట్ కోహ్లీ బోర్డు విన్నపాన్ని తిరస్కరించాడు. ఒక్క మ్యాచ్‌తో వచ్చేదేం లేదని, తాను అలాంటి వ్యక్తిని కాదని చెప్పాడు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకే కెప్టెన్సీ ఒత్తిళ్లను తగ్గించుకోవాలనుకున్నానని చెప్పాడు'అని సదరు అధికారి పేర్కొన్నాడు. కోహ్లీ రిజెక్ట్ చేసిన అతన్ని ఒప్పించే ప్రయత్నం బోర్డు చేస్తుందని చెప్పుకొచ్చాడు.

ముగింపు పలకాల్సిందంటూ..
ఇక జట్టును సరైన దిశగా నడిపించడానికి ఏడేళ్లు ఎంతో శ్రమించానని, శక్తివంచన లేకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తించానని విరాట్ కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. 'ఏదైనా ఏదో ఒక దశలో ఆగిపోవాల్సిందే. టెస్టు కెప్టెన్‌గా ఇప్పుడు నా కథ ముగిసింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తులను, కొన్ని పల్లాలను చూశా. కానీ ప్రయత్నం లోపం ఎప్పుడూ లేదు. ఏ దశలోనూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎల్లప్పుడూ జట్టు కోసం 120 శాతం ఇవ్వాలనే అనుకున్నా. అలా అనుకోలేదంటే ఏదో తప్పు చేస్తున్నట్లే. ఇంత సుదీర్ఘకాలం జట్టును నడిపించే అవకాశమిచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. ముఖ్యంగా నా సహచరులకు కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణం ఇంత అందంగా, ఎప్పటికీ గుర్తుండేదిగా సాగిందంటే కారణం వాళ్లే. టెస్టు క్రికెట్లో నిలకడగా ముందుకు సాగడానికి నాకు అండగా ఉన్న రవి భాయ్, సహాయ సిబ్బందికీ నా కృతజ్ఞతలు. చివరగా ధోనీకి నా ధన్యవాదాలు. నాలో ఉన్న కెప్టెన్‌ను అతడు నమ్మాడు. భారత క్రికెట్‌ను నేను ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తిగా అతడు నన్ను గుర్తించాడు'అని కోహ్లీ రాసుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications