యూఏఈలోనే ఐపీఎల్ ఫేజ్ 2.. విదేశీ ఆటగాళ్లు లేకున్నా.. 25 రోజుల్లో లీగ్ పూర్తి: బీసీసీఐ

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లే కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఐపీఎల్ సెకండాఫ్‌ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ - అక్టోబర్‌లో పూర్తి చేయాలనుకున్న బీసీసీఐ.. ఆ సమయంలో భారత్‌లో వాతావరణం అనుకూలించదని, వర్షాలు ఉంటాయి కాబట్టి యూఏకి తరలించడం ఉత్తమమనే ఏకాభిప్రాయానికి వచ్చింది.

విదేశీ ఆటగాళ్లు లేకున్నా..
విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా లేకున్నా యూఏఈ వేదికగా అనుకున్న సమాయానికే ఐపీఎల్ ఫేజ్ 2 పూర్తవుతుందని బీసీసీఐ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విదేశీ ఆటగాళ్ల గైర్వాజరీపై ఎస్‌జీఎంలో బోర్డు సభ్యులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. 'యూఏఈ ఫేజ్-2ను యూఏఈ వేదికగా మళ్లీ నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సంతోషంగా ముందుకు వచ్చింది. గతేడాది మాదిరే షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా లీగ్ జరుగుతుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై ఆయా క్రికెట్ బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరపనుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా లీగ్‌లో ఆడనున్నారు. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్లేయర్లు పాల్గొనడంపైనే సందేహాలు నెలకొన్నాయి. మా దిశగా మేం ప్రయత్నాలు చేస్తాం. 25 రోజుల విండోలో లీగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం'అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఏఎన్‌ఐకి తెలిపారు.

ఐసీసీకి స్పెషల్ రిక్వెస్ట్..
ఇక టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉండాలని బోర్డు భావిస్తుంది. జూన్ 1న జరిగే ఐసీసీ మీటింగ్‌లో ఇదే విషయాన్ని తెలియజేయనుంది. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉండటంతో తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఐసీసీని కోరనుంది. ప్రస్తుతానికైతే టీ20 ప్రపంచకప్‌ను భారత్ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 'మెగా టోర్నీకి ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉంది. అప్పటికే దేశంలో పరిస్థితులన్నీ చక్కడతాయనుకుంటున్నాం. అందుకే ఈ మెగా టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి జూన్ నెలాఖరు లేదా జూలై ఫస్ట్ వీక్ వరకు టైమ్ ఇవ్వాలని ఐసీసీని కోరనున్నాం'అని సదరు అధికారి పేర్కొన్నాడు. మెగా టోర్నీ నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించేలా చర్చలు జరుపుతున్నామన్నారు.
టీమిండియాను కొనియాడిన దాదా..
ఈ సర్వసభ్య సమావేశానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టు సాధించిన ఘనతలను ప్రస్తావిస్తూ ఆటగాళ్లు, కోచ్‌లను మెచ్చుకున్నాడు. 'టీమిండియా క్రికెట్ సిస్టమ్ బాగుంది. డొమెస్టిక్ క్రికెట్, నేషనల్ క్రికెట్ అకాడమీ, కోచ్‌లు, ఐపీఎల్ కూడా భారత క్రికెట్ సక్సెస్‌కు కారణం. టీమ్ సెలెక్షన్‌లో పారదర్శకత కూడా కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటే ఆత్మవిశ్వాసాన్ని ఐపీఎల్ ఇచ్చింది.'అని దాదా తెలిపాడు. రంజీ ఆటగాళ్ల నష్టపరిహారంపై ఈ మీటింగ్‌లో చర్చిలేదని తెలుస్తోంది. ఓ బోర్డు సభ్యుడు ఈ అంశాన్ని లేవనెత్తినా.. ఇది మీటింగ్ ఎజెండాలో లేదని పక్కన పెటిసినట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications