న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమి.. ఆ ఇద్దరి కోచ్‌లపై బీసీసీఐ వేటు!

BCCI unhappy with team’s performance, 2 members of Indian support staff are under the scanner

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ.. ఇందుకు కారణమైన సపోర్ట్ స్టాఫ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్ పనితీరుపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ టీకే దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ పనితీరుపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియా మాజీ ఫిజియో అయిన సోహమ్ దేశాయ్.. ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే భారత ఆటగాళ్లు తరుచుగా గాయపడుతుండటం‌తో అతని పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్. శ్రీధర్ అనంతరం ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్ బాధ్యతలు చేపట్టగా.. టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా మారింది. సునాయస క్యాచ్‌లను నేలపాలు చేస్తున్న భారత ఆటగాళ్లు.. చెత్త ఫీల్డింగ్‌తో విజయవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు. ఈ నెలలో జరిగే రివ్యూ మీటింగ్‌లో ఈ ఇద్దరి భవితవ్యంపై చర్చించనున్నారు.

BCCI unhappy with team’s performance, 2 members of Indian support staff are under the scanner

బంగ్లాదేశ్ పర్యటనకు 18 మందిని ఎంపిక చేస్తే అందులో 13 మంది మాత్రమే ఫిట్‌గా ఉండటం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం హాఫ్ ఫిట్‌నెస్‌తో ఆటగాళ్లు టీమిండియాకు ఆడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక రోహిత్ వ్యాఖ్యలతో ఏకీభవించిన ఓ బీసీసీఐ సీనియర్ అధికారి.. ఇందుకు బాధ్యులైన వారిని వివరణ కోరుతామని చెప్పాడు.

'రోహిత్ వ్యాఖ్యలతో నేను ఎకీభవిస్తున్నాను. టీమిండియాలో పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్ విభాగాన్ని సరిదిద్దే ప్రక్రియను ప్రారంభించాం. దీనికి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విభాగం మరింత మెరుగ్గా పనిచేయాలనుకుంటున్నాం. దీనికి బాధ్యులైన వారిని వివరణ కోరుతాం. ఈ పరిస్థితికి కారణమైన వారిని ఉపేక్షించం'అని సదరు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు తెలియజేశారు.

Story first published: Friday, December 9, 2022, 19:26 [IST]
Other articles published on Dec 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X