For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు!

BCCI to to meet Rahul Dravid, Rohit Sharma to discuss T20 World Cup debacle on January 1

న్యూఢిల్లీ: ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రివ్యూ మీటింగ్‌కు ముహుర్తం ఖారారు చేసింది. ఎప్పటి నుంచో ఈ మీటింగ్ నిర్వహించాలని భావిస్తున్న బోర్డు.. కీలక మెంబర్స్ బిజీగా ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చింది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందే ఈ మీటింగ్ జరగాల్సి ఉన్నా కుదరలేదు. ఇక కొత్త ఏడాదే వర్ఛువల్‌గా సమావేశమై.. టీమిండియా వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించనుంది. ఈ మీటింగ్‌కు హాజరుకావాలని, ఓటమికి గల కారణాలను వెల్లడించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌లకు నోటీసులు జారీ చేసింది.

2022 ఏడాదిలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ. రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక విదేశాల్లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దీంతో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగగలడా? లేదా? అనే విషయంపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన యజ్వేంద్ర చాహాల్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడానికి కారణాలతో పాటు రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్‌ వంటి ప్లేయర్లను రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయడానికి కారణాలను కూడా ఈ రివ్యూ మీటింగ్‌లో అధికారులు నిలదీయనున్నారు.

టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన మార్పుల గురించి ఈ మీటింగ్‌లో చర్చించబోతున్నట్టు సమాచారం.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరన్‌పే, సులక్షణ నాయిక్ ఇదే మీటింగ్‌లో కొత్త సెలక్షన్ బోర్డును ప్రకటించబోతున్నారు. వెంకటేశ్ ప్రసాద్, నయన్ మోంగియాతో పాటు మాజీ బీసీసీఐ ఛీఫ్ చేతన్ శర్మ, బోర్డు సభ్యుడు హర్విందర్ సింగ్ కూడా తిరిగి సెలక్షన్ ప్యానెల్‌ పోస్టులకు అప్లై చేశారు. స్ప్లిట్ కెప్టెన్సీ అమలు చేయడంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో వరుస విజయాలు అందుకుంది టీమిండియా. అయితే ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం నిరాశే ఎదురైంది. ఆసియా కప్‌లో సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్‌లో ఓడింది. ముఖ్యంగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, మరోసారి ఇంగ్లండ్‌పై అదే చెత్త రికార్డును రిపీట్ చేసింది. ఈ ఓటమిపై బీసీసీఐ మేనేజ్‌మెంట్‌ సీరియస్‌గా ఉంది.

Story first published: Saturday, December 31, 2022, 21:05 [IST]
Other articles published on Dec 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+