
'కొవిడ్-19 వైరస్ కారణంగా వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఈ రోజే చెప్పారు.'అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
కరోనాను కట్టడి చేసేందుకు జనసమూహం లేకుండా చూడాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. అంతర్జాతీయ, దేశవాళీ సిరీసులను రద్దు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముంబైలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. భారత్‌లో ఇప్పటి వరకు 114 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.