టీమిండియాకు గాయాల బెడద.. గంభీర్, గిల్ కన్నెర్ర! వారిపై బీసీసీఐ వేటు!
టీమిండియాను తరుచూ గాయాల బెడద వేదిస్తోంది. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఆటగాళ్లంతా జట్టుకు దూరమవుతున్నారు. ఆటగాళ్ల గాయాలు భారత విజయవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. లంక పర్యటనకు ముందు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవలే గాయపడ్డాడు.
ఆటగాళ్లు తరుచూ గాయాలతో దూరమవుతుండటంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమ్ ఫిజియో బృందంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. టీమ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా భారత ఆటగాళ్లు తరుచూ గాయపడుతున్నారని, ఆటగాళ్ల ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటన తర్వాత హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.

గాయాలు వేధిస్తున్నాయి..
ఆటగాళ్ల గాయాల కారణంగా సరైన కాంబినేషన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంచుకోలేకపోతుందని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నారు. 'కమలేశ్ జైన్ విషయంలో మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరుచూ గాయాల బారిన పడటం వల్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన కాంబినేషన్‌ను ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 15 మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కూర్పు చేయలేకపోతున్నారు. గాయాల విషయంలో ఫిజియోలు, డైరెక్టర్లకు పూర్తి అవగాహనతో పాటు స్పష్టతతో ఉండాలి.
ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే క్లియరెన్స్ ఇవ్వాలి. హడావుడిగా ఆడించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణాలా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తప్పిదాలు జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు టీమ్ మెడికల్ టీమ్ జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పదు.'అని సదరు అధికారి వెల్లడించాడు.
శ్రీలంక పర్యటన తర్వాత చర్యలు..
మాజీ ఫిట్‌నెస్ కోచ్ సోహమ్ దేశాయ్ స్థానంలో ఏడ్రియన్ లె రూక్స్‌ను నియమించినప్పటి నుంచి ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంతగా బాగా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతని పనితీరుతో అసంతృప్తి చెందిన సీనియర్ ఆటగాళ్లు, తమ గాయాలకు బయటి వైద్య నిపుణుల వద్ద ప్రైవేట్ చికిత్స తీసుకోవడం ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. శ్రీలంక పర్యటన తర్వాత టీమ్ మెడికల్ టీమ్‌తో పాటు ఫిట్‌నెస్ కోచ్ కూడా వేటు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

