న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పది రోజుల తర్వాత భార్యలకు అనుమతి!!

BCCI still undecided on Virat Kohlis request to allow WAGs on tours

న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అభ్యర్థనను బీసీసీఐ ఆమోదించినట్లు సమాచారం. కొద్ది వారాల క్రితం టీమిండియా విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల భాగస్వాములను లేదా వారి ప్రియురాళ్లను అనుమతించాలంటూ కొహ్లీ అభ్యర్థించాడు. దీర్ఘ కాలిక పర్యటనలు ఉన్న సమయంలో కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉన్న అనుమతులను సడలించిందట.

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించి

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించి

మొదటి పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట తమ జీవిత భాగస్వాములు, వ్యక్తిగత సిబ్బందిని రెండు వారాలపాటే అనుమతిస్తున్నారు. ఈ మేరకు సడలింపులు చేయాలని కోహ్లీ అభ్యర్థించారు. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్‌ రవిశాస్త్రి, కొహ్లీ, రోహిత్‌ శర్మను పాలకుల కమిటీ వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించింది.

కోహ్లీ వికెట్ అలా పడగొట్టేశా: పాక్ బౌలర్

అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు

అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు

ఆటగాళ్ల వెంట జీవితభాగస్వాములను, ప్రియురాళ్లను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని కోహ్లీ మొదట ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం ఆ అధికారి ఈ విషయాన్ని వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీకి చెప్పారు.

బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం

బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం

ఇందుకు సంబంధించి అధికారికంగా అభ్యర్థనను పంపాలని టీమిండియా మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యాన్ని పాలకుల కమిటీ అడిగినట్లు సమాచారం. అయితే దీనిపై పాలకుల కమిటీ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుందని

అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుందని

'కోహ్లీతో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుంది.' అని బీసీసీఐ అధికారి అప్పట్లో చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, October 17, 2018, 15:35 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X