హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బంపరాఫర్.. కెప్టెన్సీతో పాటు ప్రమోషన్! రోహిత్‌కు వీడ్కోలే..!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముందు బీసీసీఐ బంపరాఫర్ ఉంచినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం టీమ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. ముందుగా సెలెక్షన్ కమీటీపై వేటు వేటి కొత్త కమిటీ నియమకాన్ని చేపట్టింది. వచ్చే ఏడాది కొత్త సెలెక్షన్ కమిటీ కొలువు దీరనుంది. ఇక టీమిండియాలో స్ల్పిట్ కెప్టెన్సీని అమలు చేయాలని కూడా చూస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో బోర్డు ఉందనే ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ సైతం దీనికి సుముఖంగా ఉన్నాడని.. వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌కు ముందు అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలొచ్చాయి.

కెప్టెన్సీతో పాటు కాంట్రాక్టు..
తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. టీ20 కెప్టెన్సే కాకుండా వన్డే కెప్టెన్సీని కూడాహార్దిక్ పాండ్యాకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ అధికారులు పాండ్యాకు చెప్పారని, అతను అంగీకరిస్తే.. రోహిత్ స్థానంలో వన్డే, టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమిస్తారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్సీతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీ గ్రేడ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు వచ్చే ఏడాది ఏ కాంట్రాక్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

వన్డే కెప్టెన్సీ కూడా హార్దిక్‌కే..
'త్వరలోనే నూతన సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. ఆ తర్వాతే బీసీసీఐ ఈ విషయాన్ని చర్చించనుంది. హార్దిక్ పాండ్యా తన అభిప్రాయాన్ని చెప్పడానికి కొద్ది రోజుల సమయం ఇచ్చారు. అతనేం చెబుతాడో చూడాలి. ఇప్పటికైతే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేదు. కానీ బీసీసీఐ అధికారులు మాత్రం వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీని హార్దిక్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి' అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.

రోహిత్‌కు పొగ..
హార్దిక్‌కు టీ20 పగ్గాలు అప్పగించి.. 2023లో జరగనున్న వరల్డ్ కప్ వరకు వన్డేల్లో రోహిత్ కెప్టెన్ వ్యవహరిస్తాడని.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ముగిసే వరకు టెస్టుల్లోనూ అతనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ రోహిత్ శర్మ తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుండటంతో బీసీసీఐ అతని పట్ల అసహనంగా ఉంది. ప్రతీ రెండు సిరీస్‌లకు అతను దూరం అవుతున్నాడని, ఇలా అయితే వన్డే ప్రపంచకప్ గెలవడం కష్టమని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీపై వేటు వేసి సాగనంపే ప్రయత్నం బోర్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ పెద్దల ఆలోచనల నేపథ్యంలో రోహిత్ శర్మ వచ్చే ఏడాదే వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications