పాపం.. సుందర్! బిడ్డకు గాశారం సాల్తలేదుగా! గాయంతో మళ్లీ జట్టుకు దూరం!

న్యూఢిల్లీ: 'గాశారం బాలేకపోతే తాడే పామై కరుస్తుంది'అనే సామెత టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు సరిగ్గా సరిపోతుంది. అతనిపై విధి పగబట్టిందో లేక రాతే అలా ఉందో తెలియదు కానీ వరుసగా గాయపడుతున్నాడు. దాదాపు ఏడాదిగా గాయాలతో సావాసం చేస్తూ జట్టుకు దూరమయ్యాడు.
తాజాగా మరోసారి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. చాలా రోజుల తర్వాత టీమ్‌లోకి వచ్చిన ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్.. ఎడమ భుజ గాయంతో జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతని ఇంటర్నేషనల్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే చాంపియన్‌షిప్‌లో లాంక్‌షైర్‌కు ఆడిన సుందర్.. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.

ఎడమ భుజానికి గాయం..
దీంతో ఈ నెల 18న మొదలయ్యే సిరీస్‌కు అతను అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 'సుందర్ జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. రాయల్‌కప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. లాంక్‌షైర్, వార్సిష్టర్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. అతను రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. గాయంపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం'అని సీనియర్ అధికారి వెల్లడించారు. గత ఏడాది కాలంగా వివిధ రకాల గాయాలతో ఇబ్బంది పడుతున్న ఈ తమిళనాడు స్పిన్నర్ చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు.

పాపం బిడ్డకు గాశారం సాల్తలేదు..
'సుందర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. కానీ అతనిలో చాలా నైపుణ్యం ఉంది. దురదృష్టం కొద్దీ సిరీస్‌లు మిస్ అవుతున్నాడు. ఈ విషయంలో కొద్దిగా అదృష్టం కూడా కావాలి. మరో వారంలో భారత్‌కు ఆడుతున్నాడని అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఈ గాయమైంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు. ఇక సుందర్ వరుసగా గాయపడటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. బిడ్డకు ఏ మాత్రం గాశారం సాల్తలేదని కామెంట్ చేస్తున్నారు.

సిరాజ్ బౌలింగ్‌లో గాయపడి..
2021 జులైలో ఇంగ్లండ్ పర్యటనలో ఓ ప్రాక్టీస్ గేమ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో చేతి వేలి గాయానికి గురైన సుందర్.. వరుసగా గాయపడుతునే ఉన్నాడు. డొమెస్టిక్ సీజన్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. తర్వాత కొవిడ్ బారినపడి కోలుకున్నాడు. ఆ తర్వాత కాలిపిక్క కండరాల గాయంతో ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్, శ్రీలకంతో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడలేదు. రిహాబిలిటేషన్ తర్వాత బీసీసీఐ పర్మిషన్‌తో కౌంటీల్లో ఆడాడు. చివరకు టీమ్‌లోకి వచ్చే టైమ్‌లో మళ్లీ భుజం గాయంతో వెనక్కి వచ్చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications