Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కోచ్‌ పదవికి తుది జాబితా ఖరారు.. ఇంటర్వ్యూలు ఆ ఆరుగురికే!!

BCCI Shortlists Six Candidates For India Head Coach Position || Oneindia Telugu
BCCI shortlists six candidates for India head coach position

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ప్రక్రియకు రంగం సిద్దమయింది. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో ఈ శుక్రవారం హెడ్ కోచ్ ఎంపిక జరగనుంది. ఈ పదవి కోసం ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎనిమిది మందితో కూడిన జాబితాను సోమవారం సీఏవో ఆరుగురికి కుదించింది. గ్యారీ కిర్‌స్టెన్‌, మహేల జయవర్ధనే రేసు నుంచి అవుటయ్యారు.

ముంబైలో ఇంటర్వ్యూలు:

ముంబైలో ఇంటర్వ్యూలు:

హెడ్ కోచ్ తుది జాబితాలో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు ఉన్నారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే సీఏవో కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కమిటీ సభ్యులు జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు సంబందించిన సమాచారం ఇప్పటికే అందించారట.

స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ:

స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ:

అభ్యర్థులు అందరూ నేరుగా ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశం లేదు. ముంబైకి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా మాట్లాడి ప్రెజెంటేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం టీమిండియాతో పాటు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న కోచ్ రవిశాస్త్రి అక్కడి నుంచే స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొంటాడు. వెస్టిండీస్‌ కాలమానం ఆలస్యంగా ఉంటుంది కాబట్టి ఆరుగురు అభ్యర్థులలో ఇంటర్వ్యూకు చిట్ట చివరగా హాజరయ్యేది రవిశాస్త్రే అని సమాచారం తెలిసింది.

 రవిశాస్త్రికి గట్టి పోటీ:

రవిశాస్త్రికి గట్టి పోటీ:

రవిశాస్త్రే కోచ్‌గా కొనసాగాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో.. ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లీ అభిప్రాయాల్ని సీఏవో కమిటీ పరిగణనలోకి తీసుకోదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్‌లు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చు. ఇంటర్వ్యూలు పూర్తయిన రెండు మూడు రోజుల్లోపే కోచ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

'వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా'

తేదీలు ఖరారు కాలేదు:

తేదీలు ఖరారు కాలేదు:

సీఏవో కమిటీ ప్రధాన కోచ్‌ పదవికి మాత్రమే ఇంటర్వ్యూలు చేపట్టనుందట. సహాయ కోచ్‌లు (బౌలింగ్, బ్యాటింగ్, ఫిజియో), ఇతర సిబ్బంది సంబందించిన ఇంటర్వ్యూ లను భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మొదటగా కోచ్‌ ఎంపికను పూర్తిచేసిన తర్వాతే మిగతా వాటిపై దృష్టి సారిస్తారట.

Story first published: Tuesday, August 13, 2019, 9:13 [IST]
Other articles published on Aug 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+