
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో దుమ్ములేపారు. రాహుల్ సెంచరీ చేయగా.. రోహిత్, జడేజా హాఫ్ సెంచరీలతో మెరిసారు. ఇక బౌలింగ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/22) రెండు వికెట్లతో సత్తా చాటాడు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. అయితే, తొలి రోజు ఆటకు సంబంధించిన వివరాలు వెల్లడించిన బోర్డు.. శనివారం జరిగిన మ్యాచ్‌కు చెందిన ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో పాటు పంత్, గిల్, ఇషాంత్ స్టాట్స్‌ను తెలిపింది. తాజాగా మూడో రోజైన ఆదివారం ఆటకు సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక్కడ రవీంద్ర జడేజా(76 బంతుల్లో 54 నాటౌట్), మహ్మద్ సిరాజ్ గణంకాలను పంచుకుంది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తుండగా.. జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడని, రోహిత్ శర్మ 80+ పరుగులు చేశాడని స్పోర్ట్స్ తక్ తెలిపింది.
శనివారానికి సంబంధించిన ఆటలో పంత్(94 బంతుల్లో 121 నాటౌట్) ధనాధన్ సెంచరీతో సత్తా చూపెట్టగా.. శుభ్‌మన్(135 బంతుల్లో 85) హాఫ్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే.
బౌలింగ్‌లో పేసర్ ఇషాంత్ శర్మ(3/38) మూడు వికెట్లు సాధించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే వివరాల తెలుపాలని బీసీసీఐని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం విరాట్, రహానే ఇంకా బ్యాటింగ్ రాలేదని తెలుస్తోంది.
జూన్ 18న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎలాంటి కాంపిటేటిల్ మ్యాచ్ లేదు. దీంతో మెగా ఫైనల్‌కు తుది జట్టు ఎంపికలో ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్‌లు కీలకం కానున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌తో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకొని కాన్ఫిడెన్స్ పెంచుకుంది.