Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: పుజారా.. మా ఆశలన్నీ నువ్వేనయ్యా.!

BCCI sends a message with Cheteshwar Pujara’s net session video

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా నెట్స్‌లో చెమటోడ్చాడు. ఈ ఏడాది మార్చి నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరమైన పుజారా.. చివరిగా రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగాడు. కానీ గురువారం జరిగిన సెషన్‌లో చాలా స్వేచ్చగా బౌలర్లను ఎదుర్కొన్నాడు. నెట్ బౌలర్లు ఇషాన్ పొరెల్, కార్తీక్ త్యాగితో పాటు ఉమేశ్ యాదవ్, అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడాడు. పుజారా పాల్గొన్న నెట్ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పుజారా కీలక పాత్ర

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మొదలవ్వనుంది. కాగా, రెండేళ్ల క్రితం ఆసీస్‌లో టీమిండియా సాధించిన సిరీస్ విక్టరీలో పుజారా కీలకపాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి శతకాలు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో మూడు టెస్టులకు దూరంగా ఉంటుండటంతో ఈసారి పుజారా మరింత కీలకం కానున్నాడు. ఇక అభిమానులు కూడా కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో పుజారాపైనే ఆశలు పెట్టుకున్నారు. బీసీసీఐ షేర్ చేసిన వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పుజారా.. మా ఆశలన్నీ నువ్వేనయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.

అందరి ఆసక్తి..

అందరి ఆసక్తి..

నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే ఈ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక తొడ కండరాల గాయంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరం కాగా...టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపికయ్యాడు. త్వరలో రోహిత్ సిడ్నీ చేరుకోనున్నాడు.

సిడ్నీ చేరుకున్న రఘు..

సిడ్నీ చేరుకున్న రఘు..

టీమిండియా త్రోడౌన్‌ స్పెషలిస్టు రఘు సైతం ఆసీస్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లోని క్రికెటర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ ఆసీస్ టూర్ కోసం ముందుగా యూఏఈ వచ్చి మిగిలిన టీమ్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే యూఏఈకి బయలుదేరేముందు చేసిన కరోనా పరీక్షల్లో రఘు కరోనా పాజిటీవ్‌గా తేలాడు. దాంతో భారత్‌లోనే ఉండిపోయిన అతను రికవర్ అయ్యి తాజాగా ఆసీస్‌కు వెళ్లాడు. ఆసీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే అతను జట్టుతో కలుస్తాడు.

Story first published: Friday, November 20, 2020, 13:23 [IST]
Other articles published on Nov 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+