
అదే జరిగితే జట్టులోకి మహమ్మద్ షమీ..
అయితే ఇదే విషయంపై ఓ బీసీసీఐ సెలెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా.. దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని తెలిపాడు. గాయాలతో జట్టుకు దూరమై రీఎంట్రీ ఇస్తున్న హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు బ్యాకప్‌గా అతన్ని తీసుకున్నామని చెప్పాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న అప్‌కమింగ్ సిరీస్‌ల్లో ఈ ఇద్దరిలో ఎవరూ విఫలమైనా.. మహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడని చెప్పాడు.
అంతేకాకుండా.. మహమ్మద్ షమీ సైతం తన సత్తా ఏంటో ఈ సిరీస్‌ల ద్వారా చూపించుకోవాల్సి ఉంటుందన్నాడు. గత 10 నెలలుగా అతను టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడని, అతని సామర్థ్యాన్ని కూడా ఈ సిరీస్‌లో పరీక్షిస్తామని చెప్పాడు.

దేనికైనా ఓ విధానం ఉంటుంది..
'10 నెలల పాటు టీ20లు ఆడని ఏ ప్లేయర్‌నైనా నేరుగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేం. ఆటగాడిని ఎంపిక చేసే విషయంలో ఓ విధానాన్ని అనుసరిస్తాం. మహమ్మద్ షమీ గైర్హాజరీలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు. దాంతోనే అతనికి అవకాశం దక్కింది. అయితే హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాల గాయాలపై సందేహాలున్నాయి. వారు పూర్తిగా కోలుకోకుంటే షమీ జట్టులోకి వస్తాడు. అతను కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది'అని సదరు సెలెక్టర్ పేర్కొన్నాడు. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే షమీకి టీ20ల్లో ఆడించమని చెప్పామని, ఆ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టామని క్లారిటీ ఇచ్చాడు.

రోహిత్ వద్దనడంతోనే
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వద్దనడంతోనే మహమ్మద్ షమీని స్టాండ్‌బై ఎంపిక చేసారనే ప్రచారం జరిగింది. 15 మందితో కూడిన ఈ జట్టులోకి 14 మంది పేర్లని ఏకాభిప్రాయంతో ఖాయం చేసిన సెలెక్టర్లు.. 15వ ప్లేయర్ ఎంపిక నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి వదిలేసినట్లు తెలిసింది. సెలెక్షన్ కమిటీ మీటింగ్‌కి ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. 15వ ప్లేయర్ రేసులో మహ్మద్ షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ అభిప్రాయాన్ని సెలెక్టర్లు కోరినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది.

అశ్విన్ కోసం..
బాగా ఆలోచించిన రోహిత్ శర్మ.. అశ్విన్‌కే ఓటేసినట్లు సమాచారం. దానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మద్దతు తెలిపాడట. దాంతో షమీ స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లైనప్‌లో ఉంటే వేరియేషన్ ఉండటంతో పాటు లెప్ట్ హ్యాండర్లను కట్టడి చేయచ్చని రోహిత్ శర్మ భావించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న తలపడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో, సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.


Click it and Unblock the Notifications
