Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నోరు జారిన చేతన్ శర్మ.. తాట తీయనున్న బీసీసీఐ!

BCCI Secretary Jay Shah to Take Call on Chief Selector Chetan Sharma’s Future after Sting Operation

న్యూఢిల్లీ: 'కాలు జారితే తీసుకోవచ్చేమోగాని నోరు జారితే తీసుకోలేం' అనే సామెత బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ‌కు తెలియనట్లుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన చేతన్ శర్మకు 'నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది'అనే సామెత కూడా తెలియకపోవడం వివాదాంలో చిక్కుకునేలా చేసింది.

జీ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో నోరు జారిన చేతన్ శర్మ.. బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేశాడనే ఆగ్రహంతో ఉన్న అభిమానులకు తాజా వ్యవహారం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. తాగిన మైకంలో మాట్లాడాడో.. రిపోర్టర్‌తో ఉన్న చనువుతో నోరు జారాడో తెలియదు కానీ.. చేతన్‌ శర్మ స్ట్రింగ్ ఆపరేషన్ వ్యవహారం భారత క్రికెట్లో దుమారం రేపుతోంది.

రోహిత్ టీ20 కెరీర్ ముగిసిందంటూ..

జిన్యూస్ చానెల్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ లేకున్నా టీమిండియా ఆటగాళ్లు ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడుతారని తెలిపాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్‌ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తనను గుడ్డిగా నమ్ముతారని, టీ20ల్లో హిట్‌మ్యాన్ కెరీర్ ముగిసిందని తెలిపాడు. తాను యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించానని, దాంతో సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో చర్చనీయాంశమయ్యాయి.

రెండోసారి అవకాశం ఇస్తే..

రెండోసారి అవకాశం ఇస్తే..

బీసీసీఐ ఈ వ్యవహారంపై అధికారికంగా ఏమీ స్పందించకపోయినా.. చేతన్‌ శర్మపై చర్యలు తప్పవనిపిస్తోంది. గత ఏడాది కాలంలో తన సెలక్షన్‌ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇటీవల చేతన్‌ చీఫ్‌ సెలక్టర్‌గా మరోమారు అవకాశం దక్కించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో కమిటీలోని మిగతా సభ్యులందరినీ తప్పించి, ఛైర్మన్‌ అయిన చేతన్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించడం చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు చేతన్‌ ప్రైవేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు భారత క్రికెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి.

మౌనంగా ఉన్నా.. వేటు ఖాయం!

మౌనంగా ఉన్నా.. వేటు ఖాయం!

ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించడం ఇబ్బంది కాబట్టి ప్రస్తుతానికి బోర్డు పెద్దలు మౌనం వహిస్తున్నప్పటికీ.. చేతన్‌పై వేటు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జై షా.. చేతన్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా జట్టు ప్రణాళికలకు సంబంధించిన నిర్ణయాలను బయటకు వెల్లడించడం.. అంతర్గత వ్యవహారలను బయటపెట్టడంపై బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. చీఫ్ సెలెక్టర్ పదవి బాధ్యతల నుంచి చేతన్ శర్మను తప్పించవచ్చని హింట్ ఇచ్చాడు.

Story first published: Wednesday, February 15, 2023, 10:00 [IST]
Other articles published on Feb 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+